భారతీయ పౌరులకు తప్పనిసరిగా కావాల్సిన డాక్యుమెంట్. బ్యాంక్ అకౌంట్ దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ చోటా ఆధార్ కార్డును ఐడెంటీటీ ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్‌గా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాల వరకు ప్రతీ చోటా ఆధార్ కార్డును ఐడెంటిటి ప్రూఫ్ లేదా అడ్రస్ ప్రూఫ్ గా ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు పొందాలంటే ఆధార్ తప్పనిసరి అవసరం అవుతోంది. పీఎం కిసాన్ స్కీమ్ లాంటి పథకాల్లో లబ్దిదారులను గుర్తించి వారి అకౌంట్లలో డబ్బులు జమ చేసేందుకు ప్రభుత్వం ఆధార్ డేటానే పరిగణలోకి తీసుకుంటుంది. ఇలా చాలా చోట్ల ఆధార్ ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారింది. ఆధార్ కార్డును ఎప్పుడూ జేబులో పెట్టుకొని ఉండడం చాలా మందికి అలవాటు.
పర్సులో ఆధార్ కార్డు లేకపోతే అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ లో లేదా కంప్యూటర్ లో ఈ- ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఇ- ఆధార్ డౌన్ లోడ్ చేయడం ఆధార్ కార్డు హోల్డర్ల డేటాను రిస్క్ లో పడేస్తోంది. పబ్లిక్ కంప్యూటర్ లో అంటే ఎక్కడైనా ఇంటర్ నెట్ సెంటర్ లో ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేయడం, పని పూర్తయిన తరువాత ఆ ఫైల్ ను అదేవిధంగా వదిలేయడం మంచి అలవాటు కాదు. ఎక్కడైనా పబ్లిక్ కంప్యూటర్‌లో ఇ- ఆధార్ డౌన్ లోడ్ చేస్తే తప్పనిసరిగా డిలీట్ చేయాలని సూచిస్తోంది.
Advertisement
Advertisement
ఈ- ఆధార్ డౌన్ లోడ్ చేయడం కన్నా మాస్క్‌డ్ డౌన్ లోడ్ చేయడం మంచిది అని యూఐడీఏఐ సలహా ఇస్తోంది. ఈ ఆధార్ కార్డులో ఆధార్ నెంబర్, ఇతర వివరాలు అన్నీ ఉంటాయి. మాస్క్ డ్ ఆధార్ లో వ్యక్తిగత సమాచారం హైడ్ అవుతుంది. ఆధార్ నెంబర్ పూర్తిగా కనిపించదు. మొదటి 8 అంకెలు హైడ్ అవుతాయి. వాటి స్థానంలో xxxx – xxxx లాంటి క్యారెక్టర్లు ఉంటాయి. కేవలం చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపిస్తాయి. మాస్క్ డ్ ఆధార్ ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకోండి.
Also Read : స్త్రీలు ఆ రోజుల్లో తలంటూ స్నానం చేయరాదు.. అలా చేస్తే అంతా దరిద్రమే..!
మాస్క్ డ్ ఆధార్ డౌన్ లోడ్ చేయండి..
- ముందుగా https://eaadhaar.uidai.gov.in పోర్టల్ ఓపెన్ చేయండి.
- మీ 12 అంకెల ఆధార్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
- ఆ తరువాత మాస్క్ డ్ ఆధార్ డౌన్ లోడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
- మీ 12 అంకెల ఆదార్ నెంబర్ ఎంటర్ చేసి I want a masked Aadhaar ఆప్షన్ సెలెక్ట్ చేయండి.
- క్యాప్ఛా వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి Send OTP పై క్లిక్ చేయండి.
- ఇక ఆ తరువాత Download Aadhaar పై క్లిక్ చేస్తే మాస్క్ డ్ ఆధార్ డౌన్‌లోడ్ అవుతుంది.
- మాస్క్ డ్ ఆధార్ పీడీఎఫ్ ఫార్మాట్ లో డౌన్‌లోడ్ అవుతుంది. పాస్‌వర్డ్ ఎంటర్ చేస్తేనే ఓపెన్ చేయవచ్చు.
- మీ మొదటి పేరులోని మొదటి నాలుగు అక్షరాలు, మీ పుట్టిన సంవత్సరం కలిపి 8 డిజిట్స్ పాస్ వర్డ్ ఎంటర్ చేయాలి.
Also Read : అన్నం, చపాతి తినకుండా ఏం తినాలి..?