కిడ్నీ మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. మూత్రపిండాల యొక్క ప్రధాన విధి మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను మూత్రం ద్వారా విసర్జించడం.మన శరీలంలో ఉన్న వ్యర్థాలను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసి ఆ వేస్టేజ్‌ను మూత్రం రూపంలో బయటకు పంపుతుంది. కానీ అనేక కారణాల వల్ల మూత్రపిండాల ఆరోగ్యం క్షీణిస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, తరచుగా మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు, మూత్రపిండాల్లో రాళ్లు మరియు కొన్ని మందులను ఎక్కువగా వాడటం వంటివి కిడ్నీ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి. కిడ్నీల ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతిన్నదంటే..తిరిగి వాటిని మాములు స్థితికి తీసుకురావడం చాలా కష్టం. మూత్రపిండాల వ్యాధి యొక్క ప్రారంభ దశలలో, సాధారణంగా ఎటువంటి సంకేతాలు లేదా లక్షణాలు ఉండవు. అందుకు దీన్ని కనిపెట్టడం కాస్త కష్టమైన పనే.. కిడ్నీ పేషెంట్లలో కనిపించే కొన్ని లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Advertisement
- మూత్రపిండ వ్యాధి యొక్క ప్రారంభ లక్షణాలు తక్కువ మూత్రవిసర్జన, మూత్రంలో భారం, తరచుగా మూత్రవిసర్జన, మూత్రంలో రక్తం, రాత్రి సమయంలో ఎక్కువ సార్లు మూత్రవిసర్జన చేయడానికి లేవడం, మూత్రం ముదురు రంగులో ఉండటం, మూత్ర విసర్జన చేయాలనే కోరికగా అనిపించడం, కానీ మూత్రం పోయకపోవడం.
- కిడ్నీలు చెడిపోయినప్పుడు శరీరంలోని వ్యర్థాలు, ఇతర వస్తువులు రక్తంలోకి చేరుతాయి. దీనివల్ల చర్మవ్యాధులు, చర్మం దురదలు వస్తాయి.
- పొత్తికడుపు వెలుపల మరియు బయట నొప్పి కూడా కొన్నిసార్లు మూత్రపిండ వ్యాధి యొక్క లక్షణాలు కావచ్చు.
- చేతులు, కాళ్ళలో తిమ్మిరి, కండరాల ఒత్తిడి మొదలైనవి కూడా కొన్నిసార్లు దీని వలన సంభవించవచ్చు.
- ఊపిరి ఆడకపోవడం, నిద్ర లేకపోవడం కొందరిలో కిడ్నీ వ్యాధి లక్షణాలు.
- ఆకలి లేకపోవడం, వాంతులు, బరువు తగ్గడం కూడా కొన్నిసార్లు మూత్రపిండాల వ్యాధితో సంబంధం కలిగి ఉంటుంది.
- అలసట అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ అవి మూత్రపిండాల సమస్యలతో కూడా సంబంధం కలిగి ఉంటాయి.
- ఇలాంటి లక్షణాలు మీలో ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించి కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోండి.
Also Read : 7 రోజులపాటు దానిమ్మ తింటే ఎన్నో రోగాల నుంచి ఉపశమనం!