నటసింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో రెండో తరం టాప్ హీరోల్లో ఒకడిగా, నందమూరి నటవారసుడిగా, సినిమాలు చేస్తూ అభిమానుల్ని అలరిస్తున్నారు బాలయ్య. ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్నాడు. ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ 2.0 గా వచ్చి అన్ స్టాపబుల్ ఎంటెర్టైన్మెంట్ తో అలరిస్తున్నాడు.
Advertisement
రెండేళ్ల కిందట అఖండ తో బ్లాక్ బస్టర్ కొట్టిన బాలయ్య.. ఈ ఏడాది ప్రారంభంలో వీరసింహారెడ్డి గా వచ్చి మరో సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు దసరాకి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు వస్తున్నాడు. బాలకృష్ణ ముక్కు సూటి తనం గురించి దాదాపు అందరికీ తెలిసిందే. సినిమాలలో అయినా.. ఈవెంట్స్ లో అయినా.. ఫ్యాన్స్ తో అయినా ఒకేవిధంగా ఉంటారు. ఎవరు అయినా హద్దు మీరితే దెబ్బలు కూడా పడుతాయి. అటువైపు ఎవరు ఉన్నా.. తగ్గేది లేదంటాడు. బాలయ్యని మనస్సుతో చూసిన వాళ్లు అర్థం చేసుకుంటారని ఫ్యాన్స్ కూడా అంటూ ఉంటారు.
Advertisement
తాజాగా భగవంత్ కేసరి ప్రెస్ మీట్ లో బాలయ్య చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలయ్య మాట్లాడుతూ.. పలానా సందర్భంలో ఒక వెదవ మీరు విగ్గు పెట్టుకుంటారా అని అడిగాడు. అప్పుడు నేను అవును అయ్యా నేను పెట్టుకుంటాను. నువ్వేం పీక్కోని గడ్డం పెట్టుకున్నావా.. అని అడిగానన్నాడు. ఓపెన్ బుక్ మనమంతా ఎవ్వడికి భయపడేదే లే.. వాడికి చెబుతున్నా మళ్లీ అంటూ స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :