Home » తండ్రి కావాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..2 చాలా ఇంపార్టెంట్..!!

తండ్రి కావాలనుకుంటున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..2 చాలా ఇంపార్టెంట్..!!

by Sravanthi
Ad

చాలామంది దంపతులకు పెళ్లయిన తర్వాత కొంతకాలం వరకు కూడా పిల్లలు పుట్టక పోతే ఈ సమాజం నుంచి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా అత్తింటి వారు మహిళల్లోనే లోపం ఉందని సూటిపోటి మాటలతో వేధించే రోజులు ఇంకా ఉన్నాయి. నిజానికి బిడ్డకు జన్మనిచ్చేది స్త్రీ అయినా, ఆమె గర్భం దాల్చడంలో పురుషుడి పాత్ర కీలకంగా ఉంటుందని తెలుసుకోవాలి.

ఫెర్టిలైజేషన్ జరగాలంటే మగవారి స్పర్మ్ ఆరోగ్యంగా ఉంటేనే, ఆడవారి అండంతో కలిసి గర్భం వస్తుంది. కాబట్టి స్పెర్ము బలంగా ఉంటేనే గర్భం త్వరగా వస్తుంది. ప్రస్తుత కాలంలో చాలామంది మగవాళ్లకు తీసుకునే ఆహారం, పనిలో ఒత్తిడి వల్ల వీర్యకణాల సమస్య అనేది ఏర్పడుతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు మనం ఆహారం, జీవన శైలిలో మార్పులు చేసుకుంటే తండ్రి అయ్యే అవకాశం ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
#1.ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి:

Advertisement


చాలామంది వేడి వాతావరణంలో ఉద్యోగం చేస్తున్నట్టయితే ఎక్కువసేపు ఆ వాతావరణంలో ఉండకుండా అప్పుడప్పుడు చల్లని ప్రదేశంలోకి కూడా వెళ్లాలి. అలాగే బిగుతుగా ఉండే దుస్తులను కూడా ధరించరాదు. దీనివల్ల ఉష్ణోగ్రత పెరిగి మీ స్పెర్ముపై ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందట.

Advertisement

also read:టాలీవుడ్ లో సినిమాకు టైటిల్ కు అస్సలు సంబంధం లేని 10 సినిమాలు ఇవే….!

#2.స్మోకింగ్ చేయడం:


ధూమపానం అనేది మీ సంతానోత్పత్తి సామర్ధ్యాన్ని చాలా వరకు తగ్గిస్తుందని, స్పెర్ము బలం తగ్గి ఫలదీకరణం జరగదని, అందుకే దుమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు.
#3.పోషకాహారం తీసుకోండి:


మీ శరీరానికి సరిపడిన ఆహారం తీసుకోవాలి. పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే క్వాలిటీ అనేది పెరుగుతుందని, దీనివల్ల మీరు త్వరగా తండ్రి కావచ్చు అని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

also read:రూ.26.30కే దాల్ మఖాని, షాహి పనీర్, రోటితో సహా ఇతర వంటకాలు.. ఎక్కడంటే..?

Visitors Are Also Reading