Home » గాడ్జిల్లాకు భయపడి తల్లి ఒడిలో కూర్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

గాడ్జిల్లాకు భయపడి తల్లి ఒడిలో కూర్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

by Anji
Ad

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత పలువురు స్టార్ హీరోలు, హీరోయిన్స్ ఇలా సెలబ్రిటీలకు సంబంధించి చిన్నప్పటి ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు సినీతారల బాల్యం జ్ఞాపకాలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

Advertisement

అందులో భాగంగానే ఓ గ్లోబల్ స్టార్ హీరోయిన్ చిన్నప్పటి ఫోటో ఆకట్టుకుంటుంది. పైన ఫోటోను చూశారు కదా.. ఆ చిన్నారి ఇప్పుడు అందరికి నచ్చిన హీరోయిన్. గాడ్జిల్లాకు భయపడి రోజంతా తన తల్లి ఒడిలోనే కూర్చుండిపోయింది. ఈ ఫోటోను తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ గాడ్జిల్లా కథ చెప్పేసింది. ఎవరో గుర్తుపట్టారా ?.. పెళ్లై.. పాప జన్మించిన తర్వాత కూడా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. గుర్తుపట్టండి. మీ కోసం మరో క్లూ. తాను టాలీవుడ్ కాదు. బాలీవుడ్. అయినా సౌత్ అడియన్స్ మనసు దొచుకున్న చిన్నది ఎవ్వరో గుర్తు పట్టారా..? మరెవ్వరో కాదండోయ్.. ఈమె  హీరోయిన్ అలియా భట్. బాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కూతురు.. బీటౌన్ స్టార్ హీరో రణబీర్ కపూర్ సతీమణి. జాతీయ ఉత్తమ నటి అవార్డ్ అందుకున్న హీరోయిన్. 

Advertisement

 అలియా భట్ తన తల్లి సోని రష్దాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమెతో ఉన్న ఫోటోలను పంచుకుంటూ ఈ ఫోటో వెనక ఉన్న స్టోరీ చెప్పుకొచ్చింది. ‘నా బర్త్‌డే పార్టీ మొత్తం మీ ఒడిలో కూర్చునే గడిపాను, ఎందుకంటే గాడ్జిల్లా నన్ను తీసుకురావడానికి వస్తోందని నేను భయపడ్డాను. నేనే బలవంతంగా కొనుక్కున్నానన్న సంగతి నాకు ఇంకా గుర్తుంది.నాకు భయంగా ఉన్నా పూర్తిగా తృప్తిగా ఆనందంగా ఉంది. నేను వెళ్ళడానికి ఇష్టపడేది మరెక్కడా లేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు… మీరు లేకుండా మేము ఏమీ లేము.. ప్రతిరోజూ ప్రతి నిమిషం మీ కోసం మేము కృతజ్ఞులం’ అంటూ రాసుకొచ్చింది.

 మరిన్ని తెలుగు సినిమా వార్తల  కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్   కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading