ప్రతి నాలుగు చక్రాల వాహానానికి చక్రాలు అన్ని కూడా సమానమైన సైజు తోనే ఉంటాయి. కానీ పల్లె టూరు లలో ఎక్కువ గా చూసే ట్రాక్టర్ కు మాత్రం నాలుగు చక్రాలలో రెండు చిన్నవిగా, మరో రెండు పెద్దవి గా ఉంటాయి. ఇలా ఎందుకు ఉంటాయని చాలా మందికి తెలియదు.
Advertisement
అయితే వ్యవసాయానికి ఎక్కువ గా ఉపయోగించే ట్రాక్టర్ ముందు చక్రాలుఎందుకు చిన్నవి గా ఉంటాయని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి పాయింట్ ఎంటంటే.. ట్రాక్టర్ బ్యాలెన్స్ ను కంట్రోల్ చేయడానికి వీలుగా ఉంటుంది. సాధారణం గా ట్రాక్టర్ ను వ్యవసయానికి, ఎక్కువ బరువును లాగడానికి ఉపయోగిస్తాము.
Advertisement
అయితే ట్రాక్టర్ లో ఎక్కువ బరువు వేసిన సమయంలో ముందు చక్రాలు కూడా పెద్దవి గా ఉంటే.. ఎక్కువ బరువు ఉంటే బ్యాలెన్స్ చేయలేరు. ముందు టైర్లు చిన్నవి గా ఉండటం వల్ల సులువు గా ఎక్కువ గా బరువు లను కూడా బ్యాలెన్స్ చేయ వచ్చు. అలాగే ముందు టైర్లు చిన్నవి గా ఉండటం వల్ల ఎక్కువ బరువు తో వస్తున్న సమయంలో ట్రాక్టర్ స్లిప్ కాకుండా ఉంటుంది. అలాగే ఇతర వాహానాలు బరుదలో పడితే దానిని బయట కు తీయడం కష్టం అవుతుంది. కానీ ట్రాక్టర్ గానీ బురద లో పడితే.. ట్రాక్టర్ సునాయాసం గా బయటకు వస్తుంది.
దీనికి కారణం కూడా ముందు టైర్లు చిన్నవి గా ఉండటం. అలా చిన్నవి గా ఉండటం వల్ల గ్రీప్ అనేది ఎక్కువ గా ఉంటుంది. అయితే వ్యవసాయం అంటేనే ఎక్కువ గా బురద లో పని ఉంటుంది. కాబట్టి వాహనాలకు గ్రీప్ అనేది చాలా ముఖ్యం. అందుకే ట్రాక్టర్ల ముందు చక్రాలను చిన్నవి గా ఉంచుతారు. ఇలా చిన్న చక్రాలను ఉంచడం వల్ల గ్రీప్ ఎక్కువ గా ఉంటుంది. దీంతో బురదలో గానీ, ఎక్కువ బరువును గానీ సులువుగా తీసుకెళ్తుంది.