Home » వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా ?

వ్యూహం సినిమాను ఏపీ ఫైబర్ లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో తెలుసా ?

by Anji
Ad

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన వ్యూహం మూవీని థియేటర్స్ తో పాటు ఒకేరోజు ఒకే సమయానికి ఏఫీ ఫైబర్ నెట్ లో కూడా విడుదల చేస్తున్నామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి ఇటీవల వెల్లడించారు. వ్యూహం మూవీ ప్రభుత్వానికి అనుకూలంగా తీసిన కాబట్టే ఫైబర్ లో విడుదల చేస్తున్నామనే దాంటో వాస్తవం లేదని చెప్పిరు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అడిగారు కాబట్టే.. కార్పొరేషన్ ద్వారా ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు తెలిపారు. వ్యూహం మూవీలో అభ్యంతరాలుంటే సెన్సార్ వాళ్లు చూసుకుంటారు తప్ప నారా లోకేష్ లేఖలు రావడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని అన్నారు. వ్యూహం మూవీలో హీరో జగనా లేదా చంద్రబాబు అనేది సినిమా విడుదల తరువాత తెలుస్తుందని గౌతమ్ రెడ్డి చెప్పుకొచ్చారు. 

Advertisement

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం పేరుతో సినిమాను తెరకెక్కించారు. వైఎస్సార్ మరణం తరువాత కుమారుడు జగన్ జైలుకి వెళ్లడం.. ఆ తరువాత జైలు నుంచి తిరిగి రావడం.. సొంతంగా పార్టీ ఏర్పాటు చేసుకోవడం.. ఓదార్పు యాత్రలు.. 2014 ఎన్నికల్లో అడుగు దూరంలో అధికారాన్ని దూరం కావడం.. పాదయాత్ర, అధికారాన్ని హస్తగతం చేసుకోవడం.. చంద్రబాబు అరెస్ట్ తదితర అంశాలన్నింటినీ వ్యూహం పార్ట్ 1, 2లలో తెరకెక్కించనున్నట్టు వెల్లడించారు వర్మ. ఎన్నికల నేపథ్యంలో జగన్ పై సినిమా విడుదల చేయాలనేది వైసీపీతో పాటు దర్శుకుడు వర్మ వ్యూహంగా కనిపిస్తోంది. కుట్రలకు, ఆలోచనలకు మధ్య అని పేర్కొనడం ద్వారా రెండు సినిమాల కథలపై ఆసక్తిని రేకెత్తించారు. ఎన్నికల నేపథ్యంలో వై.ఎస్.జగన్ కి సానుకూల వాతావరణాన్ని క్రియేట్ చేయడమే ఫిలింస్ మేకర్స్ గా లక్ష్యంగా కనిపిస్తోంది. 

Advertisement

వాస్తవానికి నవంబర్ 10న ఈ మూవీ రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ.. ఈ సినిమాకి సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. సినిమాలో సీన్లు అన్నీ వ్యక్తిగత వ్యవహారాలు, మనోభావాలు కించపరిచే విధంగా ఉన్నాయని సెన్సార్ బోర్డు సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆ కారణంగా సినిమాకు సర్టిఫికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది సెన్సార్ బోర్డు. దీంతో సినిమాకు పర్మిషన్‌పై రివైజింగ్‌ కమిటీకి దరఖాస్తు చేయాలని నిర్ణయించారు. ఈ సినిమాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను తమిళ, మలయాళ నటుడు అజ్మల్ అమీర్ పోషిస్తుండగా.. వైఎస్ భారతీ పాత్రను మానస రామకృష్ణ అనే కొత్త నటి పోషిస్తున్నారు. రామదూత బ్యానర్‌పై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. టీడీపీని టార్గెట్ చేస్తూ వ్యూహం సినిమా తీసినట్లు తెలుస్తోంది. అయితే సినిమాలను ఎలా తెర‌కెక్కించి ఉంటార‌నే ఆస‌క్తి నెల‌కొంది. ఈ సినిమా వల్ల జ‌గ‌న్‌కు రానున్న ఎన్నిక‌ల్లో ఎంతో కొంత ప్ర‌యోజ‌నం క‌లిగిస్తాయా? లేదా? అనే అంశం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశ‌మ‌వుతోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి!  తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading