Home » మెడిసిన్ స్ట్రిప్స్‌పై ఈ విధమైన సంకేతాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

మెడిసిన్ స్ట్రిప్స్‌పై ఈ విధమైన సంకేతాలు ఎందుకు ఉంటాయో తెలుసా..?

by Mounika
Ad

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం అనారోగ్యకరమైన జీవనశైలి వలన ప్రజలు తరచూ ఏదోక జబ్బు బారిన పడుతున్నారు. ఒక జబ్బుకి మందు కనుక్కునే లోపే మరొక రకం కొత్త వ్యాధులు ప్రజలను వెంటాడడం మనం ప్రస్తుతం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. నేటి ప్రపంచంలో, మందులు మానవ జీవితంలో చాలా ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒక వ్యక్తి తనకు కొద్దిగా అనారోగ్యం వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులను తీసుకోవడానికి ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు.

Advertisement

వైరల్ ఫీవర్స్, జలుబు వంటివి వచ్చినప్పుడు ఎలాంటి డాక్టర్ సలహా లేకుండా సొంత నిర్ణయాలతో మందులను ఉపయోగిస్తున్నారు. ఇలా చేయటం చాలా హానికరం. ఒక ఔషధం కొన్నిసార్లు మీకు ప్రయోజనం కలిగించినప్పటికీ, మరికొన్ని సందర్భాలలో డాక్టర్ సలహా లేకుండా తీసుకునే ఔషధాలు మీ ఆరోగ్యానికి హాని చేయవచ్చు. కాబట్టి ఈ రోజు మీకు మెడిసిన్ స్ట్రిప్స్‌పై ఉన్న అన్ని సంకేతాల గురించి సమాచారాన్ని అందించబోతున్నాము. వాటిని మీరు కచ్చితంగా తెలుసుకొని జాగ్రత్త పడడం మంచి పద్ధతి.

Advertisement

 కొన్ని ఔషధాల ప్యాకెట్‌పై ఎరుపు రంగు స్ట్రిప్ ఉంది. మీరు దానిని చాలాసార్లు చూసి ఉంటారు. కానీ అలా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడానికి ప్రయత్నించరు . ఈ స్ట్రిప్ గురించి వైద్యులు లేదా మెడికల్ షాపు వారికి బాగా తెలుసు. ఔషధాల ప్యాకెట్‌పై ఎర్రటి గీత ఎందుకు ఉంది, దానిపై ఆర్‌ఎక్స్‌ ఎందుకు రాసి ఉంది అనే విషయాన్ని మందు కొనే సమయంలో చాలా శ్రద్ధ వహించాలి. ఔషధాల ప్యాకెట్‌పై ఎరుపు రంగు స్ట్రిప్ ఉంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా, ఆ ఔషధాన్ని అమ్మకూడదు. డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు. యాంటీబయాటిక్స్ దుర్వినియోగం కాకుండా నిరోధించడానికి, మందులపై ఈ ఎర్రటి గీతను ఉంచుతారు.

ఇది కాకుండా, కొన్ని ఔషధాల షీట్స్ పై NRx, XRx మరియు Rx అని వ్రాయబడి ఉంటాయి. వాటికి వేర్వేరు అర్థాలు ఉన్నాయి. Rx అని వ్రాసిన మందులను వైద్యుని సలహాతో మాత్రమే తీసుకోవాలి. మరికొన్ని ఔషధాల ప్యాకెట్‌పై ఎన్‌ఆర్‌ఎక్స్ రాసి ఉంది అంటే ఆ మందు వేసుకోవాలనే సలహా మాత్రం డ్రగ్స్ ఇచ్చే లైసెన్స్ ఉన్న డాక్టర్లు మాత్రమే ఇవ్వగలరు. కొన్ని మందులు XRxతో కూడిన స్ట్రిప్స్‌పై కూడా వ్రాయబడి ఉంటాయి. దీని అర్థం ఔషధం డాక్టర్ నుండి మాత్రమే తీసుకోబడుతుంది. ఈ ఔషధాన్ని డాక్టర్ రోగికి నేరుగా ఇవ్వవచ్చు. వైద్యుడు వ్రాసిన ప్రిస్క్రిప్షన్ ఉన్నప్పటికీ, రోగి దానిని మెడికల్ స్టోర్ నుండి కొనలేరు.

  మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

తల్లి పాలు ఏ వయస్సులో మాన్పించాలో తెలుసా ?

గ్రీన్ టీ ఏ సమయంలో తాగితే మంచిదో తెలుసా ?

రాత్రి సమయంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం కొత్త నిబంధనలను తీసుకువచ్చిన భారతీయ రైల్వే..!

Visitors Are Also Reading