Home » సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా ?

సంక్రాంతి పండుగ రోజు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా హిందూ సంప్రదాయం ప్రకారం.. సంక్రాంతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. అన్ని పండుగలు ఒకవిధంగా జరుపుకుంటే.. సంక్రాంతి పండుగను మరోలా జరుపుకుంటారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగ పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనిపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పుణ్య స్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మధ్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్థిస్తుంటారు.

Advertisement

Advertisement

దీనిని సందే గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలుతో అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. అంతేకాదండోయ్‌ ఆవుపేడతో చేసే ఈ గొబ్బెమ్మలతో సూక్ష్మజీవులు రావని, దీనివెనుక యాంటీబయాటిక్ ట్రీట్‌మెంట్‌ ఉందని పెద్దలు చెప్తారు. హిమమంత రుతువు చివరిరోజులు కాబట్టి రకరకాల క్రిములు వచ్చే అవకాశం ఉంది వాటన్నింటి నుంచి ఆవుపేడ రక్షిస్తుందని శాస్త్రీయత తెలిసన వారు పేర్కొంటున్నారు. ఆవుపేడపై వేసే నవధ్యానాలు, శనగలు పిండి ఇవి ఆయా జీవులకు ఆహారంగా ఉండటమే కాకుండా జీవకారుణ్యాన్ని నేర్పిస్తాయి.

Visitors Are Also Reading