సాధారణం మనం ఎప్పుడు ఏదో ఒక ప్రాంతానికి ప్రయాణిస్తుంటాం. అందులో ముఖ్యంగా చాలా మంది పుణ్యక్షేత్రాలను చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఉండే కొలనులు, సరస్సులు, నదులు గమనించే ఉంటారు. నదుల పైనే మనం ఎక్కువగా జీవిస్తున్నాం. ఈ నదుల నుంచి లభించే నీటి వల్లే వ్యవసాయం, పరిశ్రమ ఉత్పత్తులు లభిస్తున్నాయి. నదుల్లో కాయిన్స్ వేయడాన్ని చాలా మంది గమనించే ఉంటారు. అంతేకాదు.. నదులను ప్రత్యేకంగా ఆరాధిస్తుంటారు. నదుల్లో లేదా సరస్సుల్లో నాణాలను ఎందుకు వేస్తారు. నదులను ఎందుకు పూజిస్తారనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ఒక రూపాయి, రెండు రూపాయిలు, ఐదు రూపాయల నాణేలు అప్పట్లో ఉండేవి కాదు.. అప్పట్లో అంతా రాగి నాణేలు ఉండేవి. ఆ నాణాలను ప్రవహించే నదిలో వేయడం వల్ల నీరు స్వచ్ఛందంగా మారుతుందని చాలా మంది నమ్మకం. ప్రతీ ఒక్కరూ విధిగా ఆ పని చేసేవారు. అప్పటి రాజ్యంలో ఉండేవారు ఆ విషయంపై అందరికీ అవగాహన కల్పించారు. రాగి పాత్రలకు, రాగి నాణెలకు నీటిని శుభ్రం చేసే గుణముంటుంది. ఇది శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది కూడా. రాగి నాణేలు వేయడం వల్ల నదిలోని నీరు శుభ్రంగా మారుతుందని మనం నీరు తాగేందుకు పనికి వస్తుందని అప్పట్లో ఆ పనిని విధిగా చేసేవారు. ప్రధానంగా పూర్వకాలంలో నదిలో లభించే నీటినే తాగేవారు. పూర్వకాలం నుంచే నాణాలు లేదా కాయిన్స్ నదిలో వేసే ఆచారంగా ఉండేది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : మీరు ఎక్కువ సేపు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నా..? ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే..!
ప్రస్తుతం రాగి నాణేలు అన్ని కూడా కనుమరుగు అయ్యాయి. ఇప్పుడు మనం వాడుతున్న నాణాలు నదిలో వేయడం వల్ల అసలు ఉపయోగమే లేదు. వీటి వల్ల నీరు శుభ్రం కాదు. ఇప్పుడు వాడుతున్న నాణాలను నదిలో వేయడం వల్ల అవి తుప్పుపట్టి నదినీళ్లు పాడయ్యే ప్రమాదముంది. రైలులో, బస్సులో, ఇంకెక్కడి నుంచి అయినా ప్రయాణించేటప్పుడు పై నుంచి నదిలోకి నాణాలు వేయడం వల్ల కింద ఉండే చిన్నారులు ఇతరులు నాణాల కోసం తమ ప్రాణాలను పణంగా నీళ్లలోకి దూకుతున్నారు. ఇక నుంచి అయినా నదిలో నాణాలు వేయకుండా ఉంటే బెటర్. వాటి వల్ల నదిలో ఉన్న నీళ్లు కూడా పాడవుతాయి. పర్యావరణవేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఈ విషయాన్ని హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి : షుగర్ పేషెంట్లకు ఈ డ్రింక్ అద్భుతమైన ఔషదం.. ఒక్కసారి తాగితే చాలు..!