అయోధ్య అక్షింతలు ఎందుకు ప్రతి ఇంటికీ చేరాలని రాములవారి ట్రస్ట్ డిసైడ్ చేసింది. ఎందుకు అనేది ఎప్పుడైనా ఆలోచించారా.? అక్షింతలు బియ్యానికి పసుపు కలిపి వాటిని వేసి దీవిస్తారు. దీనితోపాటుగా పూజలు, వ్రతాలు ఇంకేమైనా దేవుడికి పూజలు చేస్తున్నప్పుడు విగ్రహాలపై అక్షింతలు వేసి మొక్కుతారు. క్షతం కానివి అంటే నాశనం కానివి అని అర్థం. మంచి బియ్యం రోకలి పోటుకు విరిగిపోవు. అలాంటి బియ్యాన్ని పసుపు లేదా నెయ్యితో లేకుంటే నూనెతో కలిపి అక్షింతలుగా తయారు చేస్తారు.
Advertisement
Advertisement
ఈ బియ్యం అంటే చంద్రుడికి చాలా ఇష్టం. మనస్సుకు అధిదేవత అయిన చంద్రుడి ప్రభావం మానవులపై అధికంగా ఉంటుందని చెబుతారు. మనిషి యొక్క మనసు, గుణము, బుద్ధి, వ్యసనము ఇవన్నీ చంద్రుడు పైన ఆధారపడి ఉంటాయట. ఎట్టి పరిస్థితుల్లో మన మనసు చెడు దారుల్లో వెళ్లకుండా అక్షింతలతో దేవునికి పూజలు చేస్తారు. మనిషి శరీరమే ఒక పెద్ద విద్యుత్ కేంద్రం. ఇందులో విద్యుత్ సరఫరా అనేది హెచ్చుతగ్గులు వస్తూ ఉండడం చాలా నార్మల్.
అయితే ఈ వ్యత్యాసాలు మనిషి యొక్క మనసు మీద, వారి ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయని అయితే బియ్యానికి విద్యుత్ శక్తిని గ్రహించే తత్వం కూడా ఎక్కువగా ఉంటుందని చెబుతుంటారు. అందుకే రాములవారి పేరు మీద ఆ అక్షింతలు మీ ఇంట్లో ఉంచుకొని రోజు పూజల్లో వాడుకుంటే ఇంట్లో మంచి జరుగుతుంది. మనసును అధీనంలో ఉంచుతుంది. రాముల వారి ఆశీస్సులు మీతో ఉన్నట్లే. అందుకే ప్రతి హిందువుకు రాములవారి ఆశీస్సులు అందాలనే లక్ష్యంతో ఈ అక్షింతలు పంపిణీ చేస్తున్నారు.