Home » అచ్చం నయనతారలా ఉన్న ఈ అందమైన భామ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ..!

అచ్చం నయనతారలా ఉన్న ఈ అందమైన భామ ఎవరో తెలుసా ? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఇదే ..!

by Anji
Ad

సాధారణంగా ఎవరైనా సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే చాలా కష్టపడాల్సిందే. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరుకుంటే కానీ గుర్తింపు రాదు. కొంతమంది అవకాశాల కోసం ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు. ఈమె కూడా అలాంటి ఇబ్బందులు చాలానే ఎదుర్కొంది. చాలామంది నువ్వు హీరోయిన్ అయ్యే ఛాన్సే లేదని.. సైడ్ క్యారెక్టర్, సిస్టర్ క్యారెక్టర్ లాంటివి ట్రై చేసుకో అని తొలుత చెప్పిన మాటలు ఆమెను ఎంతో నిరుత్సాహ పరిచాయ‌ట‌. ఇక సినిమా అవకాశాలు అడిగే అమ్మాయిలంటే అంత లోకువ..? అని తనలో తానే మదన పడేది. కానీ ఆమె లక్ష్యం మాత్రం హీరోయిన్ కావాల‌నేది ఉంది. ఇక నటన పై తనకున్న ఆసక్తి తో అవకాశాల కోసం ప్రయత్నం చేసింది. క్రమక్రమంగా సినీ అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించింది. ఆమె మరెవరో కాదు విశాఖకు చెందిన ఈ అమ్మాయి రేఖ భోజ్.


విశాఖ నగరంలోని కైలాసపురంనకు చెందిన రేఖా సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసినది. తాను చదువుకున్న రోజుల్లోనే షార్ట్ ఫిలిమ్స్ లో నటించే అవకాశం లభించింది. నటనపై మక్కువతో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంది. తన చదువు పూర్తయిన తర్వాత సినిమా హీరోయిన్ గా ప్రయత్నించింది. సుమారు 50 వరకు ఆడిషన్స్ కి వెళ్ళింది. అందరూ నయనతార మాదిరిగా ఉన్నావు అన్నారే తప్ప ఒక్కరు కూడా అవకాశం మాత్రం ఇవ్వలేదు. అలాంటి సమయంలోనే రాకేశ్ రెడ్డి అనే యువ దర్శకుడు త‌న‌కు సినిమా అవకాశం కల్పించాడని చెప్పుకొచ్చింది. కాలాయ తస్మై నమః సినిమాలో మూకీ పాత్రకు ఎంపిక చేశాడు. ఆమె సినీ ప్రస్థానం అలా మొదలైంది. ప్రస్తుతం భోజ్ ఐదు సినిమాలు పూర్తి చేసింది. మూడు సినిమాలు విడుదల అయ్యాయి. మరొక రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పెద్ద బ్యానర్లు హీరోల సినిమాలలో చెల్లెలు పాత్రలు వచ్చినా ఆమెను అంగీకరించలేదు. ఇంకా ఏదైనా ప్రోత్సాహం ఉండే ఫీల్డ్ కూడా ఎంచుకోవచ్చు కదా అని అన్నారు. థియేటర్లో కాలాయ తస్మై నమః సినిమా చూసి గో హెడ్ అన్నారు. నటనకు ప్రాధాన్యత ఉన్న పత్రాలను ఎంపిక చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

Advertisement

Advertisement

బిగ్ బాస్ ఫేం షణ్ముఖ్ జస్వంత్ ను హీరోగా, రేఖ హీరోయిన్ గా ‘లవ్ ఇన్ వైజాగ్’ షార్ట్ ఫిలిం తీశారు రాకేష్ రెడ్డి. అదే కాంబోలో డర్టీ పిక్చర్ సినిమాను జాగ్రత్త చిత్రీకరించారు. విశాలమైన కన్నులు మంచి భావాలు పలికించడం తనలో ప్రతిభను గుర్తించడంలో రాకేష్ సఫలం అయ్యాడు. ఇక వరుస ప్రాజెక్టులలో ఆమెను ఎంతో ప్రోత్సహించారు. 1980 సంవత్సరం నాటి నేపథ్యంలో సాగిన కాలాయ తస్మై నమః సినిమాలో అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో రేఖ పని మనిషి పాత్రలో అద్భుతంగా నటించింది. దీంతో రాకేష్ తన తర్వాత ప్రాజెక్టు అయినటువంటి రంగీలా (రంజిత‌-గీత‌-లాస్య‌) చిత్రంలో గీత పాత్రను పోషించింది.ఇక మూడ‌వ ప్రాజెక్టు దామిని విల్లాలో డైనమిక్ స్త్రీవాద జర్నలిస్ట్ పాత్రలో ఆమె నటిస్తోంది. ఆదిత్య ఓం ఇందులో హీరోగా నటిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్నది.

రవి శంకర్ దర్శకత్వంలో రూపొందించిన థ్రిల్లర్ సినిమా స్వాతి చినుకు సంధ్య వేళలో.. నిర్బంధం సినిమా ఫేమ్ బండి సరోజ్ కుమార్ హీరోగా స్వీయ‌ దర్శకత్వంలో సినిమాలో ఆమె నటించింది. ఒక మూడు సినిమాలు కథా చర్చల్లో కొనసాగుతున్నాయి.ఇక రేఖ తండ్రి భోజరాజు ఏ ఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి సూర్యకుమారి గృహిణి. రేఖ‌ భోజ్ కు ఓ సోదరి కూడా ఉంది. ఆమె సోద‌రి ప్ర‌స్తుతం బీఫార్మసీ చదువుతోంది. హీరో శోభన్ బాబుకు ఆమె తల్లి వీరాభిమాని. తల్లి నిత్యం శోభన్ బాబు సినిమాలు చూడడం తో రేఖ‌ కూడా తల్లి మాదిరిగానే సినిమాలు చూసేది. అప్పటి నుంచే న‌ట‌న పట్ల ఆసక్తిని పెంచుకుంది రేఖ. నిరీక్షణ సినిమాలో అర్చన పోషించిన పాత్ర అంటే ఆమెకు ఎంతో ఇష్టం. హీరోలలో ఫేవరేట్ హీరోలు పవన్ కళ్యాణ్ , ప్రభాస్ డైరెక్టర్ లలో రాజమౌళి ఇష్టమట. ట్రాన్స్ జెండర్, మతిస్థిమితం లేని, పడ్డ మహిళ, బిచ్చగత్తె ఈ పాత్రలో నటించడానికి సిద్ధమే చెబుతోంది రేఖ భోజ్.

Also Read : 

మురళీమోహన్: NTR ను నమ్మించి మోసం చేశారు.. ఆరోజు రాత్రి అలా జరగడంతో నా కడుపు మండిపోయింది..?

ఆ ఒక్క కారణం వల్లే..! సురేఖ ని పెళ్లి చేసుకోవడం చిరంజీవి తండ్రికి ఇష్టం లేదట ..! కానీ చివరికి…!

 

Visitors Are Also Reading