Home » నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ ను అడ్డుకుంది ఎవరో తెలుసా..?

నందమూరి అల్లుడు అవ్వాల్సిన మహేష్ ను అడ్డుకుంది ఎవరో తెలుసా..?

by Bunty
Published: Last Updated on

మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుస సినిమాతో దూసుకుపోతూ ప్రేక్షకులను ఎల్లప్పుడూ అలరిస్తూ ఉంటారు. తన అందం, యాక్టింగ్ తో ప్రేక్షకులను ఫిదా చేస్తుంటాడు. మహేష్ బాబు సినిమాలో నటిస్తున్న సమయంలోనే నమ్రతను ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే మహేష్ బాబు నమ్రతను పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నందమూరి ఇంటికి వారసుడు అయ్యుండేవాడట.

బాలకృష్ణ మహేష్ బాబుని ఇతర ఇంటి పెద్దళ్లుడిగా చేసుకోవాలని అనుకున్నారట. కానీ మహేష్ బాబు అప్పటికే నమ్రతను ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఈ వివాహం రద్దు చేశారట. సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీఆర్ మంచి స్నేహితులు కావడంతో బ్రాహ్మినీకి, మహేష్ బాబుకి వివాహం జరిపించాలని అనుకున్నారట. ఈ విషయంలో కృష్ణ, బాలకృష్ణ కూడా వీరికి వివాహం చేయాలని నిశ్చయించుకున్నారట.

కానీ అప్పుడే సినిమాల్లోకి మహేష్ బాబు ఎంట్రీ ఇవ్వడంతో కొద్దిరోజుల తర్వాత వివాహం జరిపించాలని అనుకున్నారట. ఇక కొన్ని రోజులకి బాలకృష్ణ మహేష్ బాబుతో వివాహం గురించి చెప్పాడట. దీంతో మహేష్ బాబు, నమ్రతను ప్రేమిస్తున్నారని చెప్పడంతో… ఇద్దరు ప్రేమికులని విడదీయడం ఎందుకని బాలకృష్ణ పక్కకు తప్పుకున్నారట. ఇక మహేష్ బాబు నమ్రతను వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం జరిగిన రెండు సంవత్సరాలకి తన మేనబావ అయినటువంటి నారా లోకేష్ తో బ్రాహ్మణికి వివాహం జరిపించారు బాలకృష్ణ.

ఇవి కూడా చదవండి: 

నందమూరి హీరోలలో నాన్న యాక్టింగ్ స్కిల్స్ వచ్చింది వారికే.. పురంధేశ్వరి సెన్సేషనల్ కామెంట్స్..!
అల్లుడి గురించి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు.. 26 ఏళ్లుగా పోరాటం..!

Visitors Are Also Reading