Home » సలార్ లో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్ర లో నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా ?

సలార్ లో పృథ్విరాజ్ చిన్నప్పటి పాత్ర లో నటించిన ఈ కుర్రాడు ఎవరో తెలుసా ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలైంది. మొదటి రోజు రికార్డు స్థాయిలో రూ.178 కోట్లను వసూలు చేసింది. రిలీజ్ రోజు ఉదయం 4 గంటల నుంచే సినిమాకి ఫర్మిషన్ ఇచ్చారు. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. ప్రభాస్ సలార్ హిట్ కొట్టారని అభిమానుల సైతం కాలరేగిరేసుకొని తిరుగుతున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలన్నీ కూడా అట్టర్ ప్లాప్ కావడం, సలార్ మూవీ నుంచి వచ్చిన అప్డేట్లు ప్రేక్షకులను పెద్దగా మెప్పించకపోవడం. మరొకవైపు ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కూడా నెగిటివ్ గా కామెంట్లు చేయడంతో అందరూ సినిమాపై ఆశలు వదులుకున్నారు.

Advertisement

అలాంటి సమయంలో ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈరోజు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అద్భుతమైన టేకింగ్ తో ఈ చిత్రంతో భారీ విజయాన్ని అందించేలా చేశారు. ఈ సినిమా చూసి ఫిదా అవ్వని వారంటూ ఎవరూ లేరు. ఇదంతా పక్కన పెడితే.. సలార్ సినిమాలో నటించిన ఒక కుర్రవాడు గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా వినిపిస్తున్నాయి. సలార్ సినిమాలో పృధ్వీ రాజ్ చిన్నప్పటి పాత్రను చేసిన కుర్రవాడి నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. దీంతో ఆ కుర్రవాడు ఎవరు అని ఆరా తీయగా.. మన తెలుగు హీరో కుమారుడని తెలిసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. అసలు విషయంలోకి వెళ్తే.. విలన్ గా పృద్విరాజ్ చిన్నప్పటి పాత్ర చేసిన కుర్రాడి పేరు కార్తికేయ దేవ్. ఈ కుర్రాడు ఎవరో కాదు టాలీవుడ్ లో మాస్ హీరోగా పేరుపొందిన రవితేజ కజిన్ బ్రదర్ కొడుకు అన్నట్లుగా తెలుస్తోంది. వరుసకి రవితేజకి కూడా కుమారుడే అవుతారట.

ప్రస్తుతం ఈ కార్తికేయ దేవ్ పదవ తరగతి చదువుతున్నారు. పృద్వి రాజ్ చిన్నప్పటి పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేసి చివరికి కుర్రాన్ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఒక నెల రోజులపాటు రిహార్సల్ చేసిన తర్వాత 15 రోజులలో ఈ కుర్రాడు పాత్రకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తి చేశారని, రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో కార్తికేయ దేవ్ చెప్పారు. ఈ విషయం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నది. సలార్ మూవీ కలెక్షన్స్ విషయంలో కూడా దాదాపుగా రూ. 175 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి, ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సెకండ్ స్థానాన్ని అందుకోవడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో సినిమా రూ.1000 మార్కుని అందుకుంటుందేమో చూడాలి.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading