సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్ పాత్రలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వీరు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో కొందరూ తారలు తమ సత్తా చాటుతున్నారు. బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే ఈ ముగ్గురు తారల గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఇండస్ట్రీనీ శాసిస్తున్న దీపికా పదుకొనె, కత్రినా కైఫ్, అనుష్క శర్మ ఉన్నారు. వీరు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలతో అపారమైన కీర్తిని పొందడమే కాకుండా ఆస్తులను సంపాదించారు. భారతదేశంలోనే అత్యధిక ధనిక ప్రముఖుల జాబితాలో ఉన్నారు. వీరి ముగ్గురిలో ఎవరు రిచెస్ట్ హీరోయిన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
దీపికా పదుకొనే :
భారతదేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్స్ లో దీపికా పదుకొనే ఒకరు. 2007లో ఓంశాంతి ఓం సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటీమణుల్లో ఒకరిగా మారింది. సంజయ్ బన్సాలీ తెరకెక్కించిన పద్మావత్ మూవీకి రూ.13కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. అప్పటివరకు రూ.13 కోట్లు తీసుకున్న హీరోయిన్లను దాటేసింది. ఈ మైలు రాయిని సాధించిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది. పద్మావత్, బాజీరావ్ మస్తానీ, జవాన్, చెన్నై ఎక్స్‌ప్రెస్ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌లలో కనిపించింది. దీపికా పదుకొణె నికర విలువ సుమారుగా రూ. 500 కోట్లు. ఒక్కో సినిమాకు రూ. 10 నుంచి 15 కోట్లు తీసుకుంటుంది. అలాగే సొంతంగా చర్మ సంరక్షణ బ్రాండ్ 82°E, ప్రొడక్షన్ హౌస్ కలిగి ఉంది. తనిష్క్, ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, లూయిస్ విట్టన్, కార్టియర్ వంటి బ్రాండ్స్ కి అంబాసిడర్.
Advertisement
అనుష్క శర్మ :
2008లో షారుఖ్ ఖాన్‌తో కలిసి రబ్ నే బనా ది జోడి సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది. తక్కువ సమయంలోనే జబ్ తక్ హై జాన్, ఏ దిల్ హై ముష్కిల్, సుల్తాన్, సంజు వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అనుష్క శర్మ నికర విలువ సుమారుగా రూ. 300 కోట్లు. ఆమె ఒక్కో సినిమాకు 12-13 కోట్లు. నిర్మాణ సంస్థ క్లీన్ స్లేట్ ఫిల్మ్స్‌ను సహ-స్థాపన చేసింది. “NH10,” “పాతాల్ లోక్,” “బుల్బుల్” వంటి విజయవంతమైన ప్రాజెక్ట్‌లను చేసింది. ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 4 కోట్లు. ఫోర్బ్స్ ఆమెను 2019లో అత్యధికంగా చెల్లించే 21వ సెలబ్రిటీగా మారింది. ఈమె సంపాదన రూ. 28.67 కోట్లు.
కత్రినా కైఫ్ :
2003లో బూమ్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమె ఫిల్మోగ్రఫీలో మైనే ప్యార్ క్యున్ కియా?, నమస్తే లండన్, రాజనీతి, జిందగీ నా మిలేగీ దొబారా, బ్యాంగ్ బ్యాంగ్!, టైగర్ జిందా హై, జీరో చిత్రాల్లో నటించింది. బాలీవుడ్‌లో అత్యంత బిజీ నటీమణులలో ఒకరిగా మారింది. కత్రినా నికర విలువ రూ. 235 కోట్లు. ఒక్కో సినిమాకు 10 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. భారతదేశంలోని టాప్ సెలబ్రిటీ ఎండోర్సర్ కూడా. ఒక ఎండార్స్‌మెంట్ డీల్‌కు రూ. 6 నుండి 7 కోట్లకు పైగా వసూలు చేస్తూ, ఆమె తన బ్రాండ్ అసోసియేషన్‌లకు భారీ రెమ్యునరేషన్ అందుకుంటుంది.
Also Read : దేవర మూవీపై కీలక అప్డేట్ ఇచ్చిన జాన్వీకపూర్..!