టాలీవుడ్ హీరో మోహన్ బాబు, హీరోయిన్ దివ్య భారతి కాంబోలో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి అసెంబ్లీ రౌడీ. ఈ సినిమా కథ ను తమిళ దర్శకుడు పి వాసు అందించారు. ఆ సినిమాను తెలుగులో అసెంబ్లీ రౌడీ పేరు తో తెరకెక్కించారు మాస్ చిత్రాల దర్శకుడు బి.గోపాల్. ఇందులోని పాటలు అద్భుతమైన ప్రేక్షకధారణ పొందాయి. ఈ సినిమాకి దివ్యభారతి ఎంత ప్లస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మూవీతోనే మోహన్ బాబు కలెక్షన్ కింగ్ గా కూడా మారిపోయాడు.
Advertisement
ఈ సినిమాను తన సొంత బ్యానర్ అయిన శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లోనే మోహన్ బాబు ప్రొడ్యూసర్ గా మారి తెరకెక్కించాడు. ఈ సినిమాలో దివ్యభారతీ, మోహన్ బాబుల కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యింది అనే టాక్ వచ్చింది. అసెంబ్లీ రౌడీ సినిమా కోసం మోహన్ బాబు భారీగా డబ్బు ఖర్చు పెట్టాడు. దివ్యభారతి కోసం ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూసిన ప్రేక్షకులు కూడా ఉన్నారు. అసెంబ్లీ రౌడీ విజయం సాధించగానే దివ్యభారతి కోసం టాలీవుడ్ లోని దర్శకులు, నిర్మాతలు క్యూ కట్టారు. అయితే ఆమె అప్పటికే బాలీవుడ్ తో పాటు అనేక భాషల్లో బిజీగా ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి చాలా తక్కువ సినిమాల్లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు పరిమితమైంది.
Advertisement
వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణ వంటి హీరోలతో నటించిన దివ్యభారతి అందరితో ఒక్కో చిత్రం లోనే నటించినప్పటికీ.. కేవలం మోహన్ బాబుతోనే మరొక సినిమా కూడా చేసింది. అదే చిట్టమ్మ మొగుడు. ఈ కథ మాతృక కూడా తమిళ సినిమానే. అయితే కథపై పూర్తి నమ్మకం లేని మోహన్ బాబు వేరే నిర్మాత తో డబ్బులు పెట్టించాడు. దివ్య భారతి హీరోయిన్ అయితేనే సినిమా తీస్తాను అని మోహన్ బాబు చెప్పడంతో కేవలం దివ్యభారతి కోసమే ఈ సినిమా తీసినట్టుగా అయిపోయింది. కానీ సినిమా విడుదలై దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుని నిర్మాతను రోడ్డు పాలు చేసింది. దీంతో దివ్యభారతి కోసం నిర్మాతను నిండా ముంచేశాడు మోహన్ బాబు అనే టాక్ అప్పట్లో వచ్చింది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!