సాధారణంగా ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో బాలీవుడ్, కన్నడ, తమిళం, మలయాళం వంటి సినిమాల్లో భారీ బడ్జెట్ పెట్టి చిత్రాలను నిర్మిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది హీరోలు కూడా ఒక్కో సినిమాకు వందల కోట్లు పారితోషకం తీసుకునే వారు చాలా మందే ఉన్నారు. ఒక సినిమాలో ఫేమస్ అయిన తరువాత పలు బ్రాండ్ లకు ప్రకటనలు ఇచ్చే అవకాశం వస్తుంది. దీని నుంచి కూడా డబ్బు చాలానే వస్తుంది. భారత్ లో టాప్ 10 సంపన్న నటుల జాబితా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
షారూఖ్ ఖాన్ :
భారతదేశంలో ఉన్న నటులలో అత్యంత సంపన్నుడు షారూఖ్ ఖాన్. ఒక్కో సినిమాకి కోట్లాది రూపాయలను తీసుకుంటాడు. ఐపీఎల్ లో అతనికి సొంత జట్టు కూడా ఉంది. ఓ సినిమా నిర్మాణ సంస్థ కూడా ఉంది. పలు బ్రాండ్లను ప్రమోట్ చేస్తుంటాడు. అతని మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.6300 కోట్లు.
హృతిక్ రోషన్ :
బాలీవుడ్ ప్రతిభవంతులైన హీరోల్లో హృతిక్ రోషన్ కూడా ఒకరు. ఈయన ఒక్కో సినిమాకి రూ. 50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటాడు. బ్రాండ్ ప్రమోషన్ కోసం రూ.10కోట్లు తీసుకుంటాడు. దుస్తులు, షూ బ్రాండ్ ని కూడా కలిగి ఉన్నాడు. హృతిక్ ఆస్తి విలువ దాదాపు రూ.3100 కోట్లు.
సల్మాన్ ఖాన్ :
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ కి పెద్ద హీరో అని పేరు ఉంది. సొంత దుస్తుల బ్రాండ్, స్వచ్ఛంద సంస్థను కూడా కలిగి ఉన్నాడు. 57 ఏళ్లు దాటినా పెళ్లి అనే ఆలోచన రాలేదు. అయితే సల్మాన్ కి చాలా చోట్ల ఆస్తి ఉంది. ఆయన ఆస్తి సుమారు రూ. 2850 కోట్లు ఉన్నట్టు సమాచారం.
అక్షయ్ కుమార్ :
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ తన సినిమాకి సంబంధించిన పనులను చాలా వేగంగా పూర్తి చేస్తున్నాడు. అందుకే ఏడాదికి ఆయన నటించిన మూడు-నాలుగు సినిమాలు విడుదలవుతుంటాయి. అత్యధిక పన్ను చెల్లించే హీరోగా అక్షయ్ కుమార్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన ఆస్తి విలువ దాదాపు రూ.2,660 కోట్లు ఉంటుంది.
అమీర్ ఖాన్ :
Advertisement
నటుడు అమీర్ ఖాన్ నటనకు విరామం ఇచ్చాడు. అలా అని ఆయనకు డిమాండ్ అస్సలు తగ్గలేదు. చాలా వెంచర్లలో పెట్టుబడి పెట్టాడు. అతనికి సొంత నిర్మాణ సంస్థ ఉంది. అమీర్ ఖాన్ ఆస్తి రూ.1862 కోట్లు ఉంది.
రామ్ చరణ్ :
టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ఇటీవలే RRR మూవీతో గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు కూడా లభించిన విషయం తెలిసిందే. ఈ స్టార్ నటుడికి చాలా డిమాండ్ ఉంది. రామ్ చరణ్ సినిమాలతో పాటు పలు బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటాడు. రామ్ చరణ్ ఆస్తి రూ.1370 కోట్లు.
అక్కినేని నాగార్జున :
టాలీవుడ్ సీనియర్ హీరో, బిగ్ బాస్ హోస్ట్ అక్కినేని నాగార్జునకి కూడా చాలా డిమాండ్ ఉంది. నాగార్జున ఒక్కో సినిమాకు రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడు. బిగ్ బాస్ కోసం అయితే ఏకంగా రూ.15కోట్లు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
రజినీకాంత్ :
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ సినీ ఇండస్ట్రీలో చాలా ఏళ్ల నుంచి కొనసాగుతున్నారు. ఇటీవలే ఆయన నటించిన జైలర్ మూవీ సూపర్ హిట్ సాధించింది. ఈ మూవీతో విజయాన్ని అందుకున్నాడు. రజినీకాంత్ ఏజ్ పెరుగుతున్నప్పటికీ ఆయన జోష్ మాత్రం తగ్గడం లేదు. ఆయన ఆస్తి దాదాపు రూ.450 కోట్లపైగానే ఉంది.
అల్లు అర్జున్ :
అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయనకు సొంత మల్టీప్లెక్స్ ఉంది. ఆయన ఆస్తి దాదాపు రూ.380 కోట్లు. ప్రస్తుతం పుష్ప 2 మూవీతో చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అంతటి స్టార్ గా పైకి రావాల్సిన సుమంత్ ఎందుకు ఎదగలేకపోయారు ?
మహేష్ బాబు అతడు మూవీలో బ్రహ్మనందం పేరేంటో మీకు గుర్తుకుందా ?