Home » యాంకర్ వర్షిణి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా ? ఇన్నాళ్లకు వెలుగులోకి..!

యాంకర్ వర్షిణి ఎవరితో ప్రేమలో ఉందో తెలుసా ? ఇన్నాళ్లకు వెలుగులోకి..!

by Anji
Ad

యాంకర్ వర్షిణి పెళ్లి మీద ప్రేమ వ్యవహారాల మీద ఎప్పుడూ ఏదో ఒక రూమర్ పుట్టుకొస్తూ ఉంటుంది. తాజాగా యాంకర్ వర్షిణి ప్రేమ వ్యవహారం గురించి మరోసారి వార్తలు వినిపించాయి. మొన్నటివరకు హైపర్ ఆదితో వర్షిణి పెళ్లి అనే వార్త వినిపించిన విషయం తెలిసిందే. ఇక ఆ తరువాత ఢీ షో డైరెక్టర్, మల్లెమాల టీమ్ మెంబర్ తో వర్షిణి ప్రేమాయణం సాగిస్తుందనే రూమర్ వచ్చింది. ఆదితో పెళ్లి రూమర్స్ వర్షిణి వరకు వెళ్లాయి. నెటిజన్లు నేరుగా ఆమెను అడిగారు. వాటిపై వర్షిణి ఇలా సమాధానం చెప్పింది. 

Advertisement

మీరు అందరూ అనుకుంటున్నట్టుగానే ఆ వార్తలో మాత్రం ఎలాంటి వాస్తవం లేదు. అవి అన్ని తప్పుడు వార్తలు. ఈ ఫేక్ వార్తలను క్రియేట్ చేసే వారి ఆనందానికి నేను రియాక్ట్ అవ్వాలని అనుకోవడం లేదు. కానీ.. ఇలా అందరూ అడుగుతున్నారని క్లారిటీ ఇస్తున్నాను. ఆ వార్తలో ఎలాంటి నిజం లేదని.. అన్ని రూమర్లే అని ఖండించింది వర్షిణి. దీంతో ఆమెకు ఆదికి మధ్య ఏం లేదని అందరికీ క్లియర్ గా అర్థం అయింది. 

Advertisement

తాజాగా వర్షిణి మరోసారి ప్రేమ వార్తలతో తెరపైకి వచ్చింది. ఢీ కొరియోగ్రాఫర్ అభితో వర్షిణి కలిసి కనిపించింది. ఇద్దరూ రెస్టారెంట్ లో కలిసి కనిపించారు. వీరిద్దరూ సెల్ఫీకి ఫోజులు ఇచ్చారు. అంతేకాదు.. అభి ఈ ఫొటోను తన ఇన్ స్టా స్టోరీలో షేర్ చేస్తే.. వర్షిణి సైతం రిప్లై ఇచ్చింది. తన స్టోరీలోను ఆ ఫొటోలను షేర్ చేసింది. అభి షేర్ చేస్తూ కింద లవ్ సింబల్ ని కూడా పెట్టేశాడు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే రూమర్ పుట్టుకొచ్చింది. దీనిపై వర్షిణి ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌.. సత్తా చాటిన ఆర్ఆర్ఆర్.. అవార్డులు పొందిన నటులు వీళ్లే..!

చివరి కోరిక తీరకుండానే మరణించిన కైకాల..! ఇంతకీ ఆయన ఆఖరి కోరిక ఏమిటంటే..?

 

Visitors Are Also Reading