సాధారణంగా మనం వంటకాలను ఉల్లిగడ్డలు లేకుండా అస్సలు ఊహించలేం. ఏ కూర వండినా అందులో ఒక ఉల్లిగడ్డ అయితే తప్పనిసరిగ్గా వేయాల్సిందే. ఉల్లిపాయ వేస్తేనే కర్రీ టేస్ట్ అనిపిస్తుంది. అంతేకాదు.. ఆరోగ్యానికి ఇవి ఎంతో మేలు చేస్తాయి. అందుకే.. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని మన పెద్దలు చెబుతుంటారు. అయితే మన మార్కెట్లో ఎర్ర ఉల్లితో పాటు తెల్ల ఉల్లిగడ్డ కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరి వీటిలో ఏది బెటర్? ఏ రంగు ఉల్లిపాయలు తింటే ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనం అనే సందేహం చాలామందిలో ఉండే ఉంటుంది.
Advertisement
వాస్తవానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, ఫైటోన్యూట్రియెంట్ ఆరోగ్యానికి అంతే శ్రేయస్కరం కూడా. పచ్చిగా కానీ, ఉడికించి కానీ తెల్ల ఉల్లిగడ్డలను తీసుకోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. తెల్ల ఉల్లిగడ్డలను ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు.
Advertisement
తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సహాయపడతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో పెట్టవచ్చు. తెల్ల ఉల్లిలోని సల్ఫర్ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు కూడా ఇందులో ఉన్నాయి. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి కూడా తెల్ల ఉల్లి సహాయ పడుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!