మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత మూవీతో సూపర్ విజయాన్ని అందుకున్నాడు. ఫస్ట్ మూవీతోనే తన స్టామినా ఏంటో చూపించాడు. ఆ తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన మగధీర మూవీతో ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. అలాగే ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు చరణ్. అప్పటి నుంచి ఇప్పటిరవకు వెనక్కి తిరిగి చూడకుండా వరుస సినిమాలు చేస్తూ.. సక్సెస్ సాధిస్తూ తన మార్కును క్రియేట్ చేసుకున్నాడు.
Advertisement
ప్రతస్తుతం గ్లోబల్ స్టార్ వెలుగొందుతున్నాడు రామ్ చరణ్. అయితే రామ్ చరణ్ చిన్నప్పటి నుంచే వాళ్ల నాన్న సినిమాలు చూసుకుంటూ పెరిగాడట. ఆయనకి వాళ్ల నాన్న సినిమాల్లో ఏ సినిమా అంటే ఎక్కువగా ఇస్టం అని అడగ్గా ఆయన దానికి సమాధానంగా ఒక్క సినిమా అని చెప్పడం కష్టం. కానీ బాగా నచ్చిన కొన్ని సినిమాల పేర్లు అయితే చెబుతాను.. అంటూ గ్యాంగ్ లీడర్, జగదేక వీరుడు అతిలోక సుందరి, యముడికి మొగుడు, ఖైదీ, ఠాగూర్ వంటిసినిమాల పేర్లు చెప్పారు రామ్ చరణ్.
Advertisement
వాస్తవానికి చిరంజీవి సినిమాలు అంటే దాదాపు అందరికీ నచ్చుతాయి. ఎందుకు అంటే చిరంజీవి సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ కూడా కమర్షియల్ ఎలివెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆయన నటన చూస్తూ కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లు చాలా మంది ఉన్నారు అంటూ సినీ మేధావులు సైతం వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. చిరంజీవి క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన సినిమాలు నచ్చని ప్రేక్షకుడుండడు. ప్రధానంగా మెగాస్టార్ డ్యాన్స్ ని సగటు ప్రేక్షకుడు కూడా ఎంజాయ్ చేస్తాడనే చెప్పాలి. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర మూవీలో నటిస్తున్నాడు. చరణ్ మాత్రం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే గేమ్ ఛేంజర్ మూవీలో నటిస్తున్నాడు.