దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన అప్పట్లో అగ్ర దర్శకుడిగా ఇండస్ట్రీలో ఓ ఊపు ఊపారు. ఈయన దర్శకత్వంలో ఎన్టీఆర్, చిరంజీవి వంటి అగ్ర హీరోలు చాలా సినిమాల్లో నటించారు.
Advertisement
తన 100 వ సినిమాగా అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ ని తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ గంగోత్రి అనే సినిమాని తెరకెక్కించాడు. అయితే అప్పటికే రాఘవేంద్రరావు తన 100వ చిత్రం చాలా బాగుండాలని మంచి కథ కోసం చాలా కథలు విన్నాడు.
అయితే అవేవీ కూడా రాఘవేంద్రరావుకు పెద్దగా సంతృప్తిని ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో ఇంద్ర లాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత చిన్ని కృష్ణ అల్లు అరవింద్ కి ఓ కథ చెప్పాడట. ఆ కథని రాఘవేంద్రరావుకు చెప్పమని అల్లు అరవింద్ రాఘవేంద్రరావు దగ్గరికి చిన్ని కృష్ణ పంపించగా ఆయన రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్లి కథ చెప్పాడు. అది చాలా బాగా నచ్చిన రాఘవేంద్రరావు అల్లు అర్జున్ తో చేయాలని ఫిక్స్ అయి సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయింది. అయితే అల్లు అర్జున్ కి మాత్రం కెరీర్ పరంగా అంత పెద్దగా ఉపయోగపడలేదనే చెప్పవచ్చు. ఇక తర్వాత తన యాక్టింగ్ యాక్టింగ్ ని చూపిస్తూ ఆర్య సినిమాతో మళ్లీ యూత్ లో తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు బన్నీ.
Advertisement
ఇక ఇదిలా ఉంటే.. చిన్నికృష్ణ రాఘవేంద్రరావుకు చెప్పిన ఈ గంగోత్రి స్టోరీ అనేది ఇండస్ట్రీలో చాలా స్ట్రగ్లింగ్ లో ఉన్న ఒక రైటర్ దగ్గర నుంచి చిన్ని కృష్ణ కొన్నాడట. అతను డబ్బులు కూడా ఇవ్వకుండా తన స్టోరీ అని చెప్పి రాఘవేంద్రరావుకి కథ చెప్పి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయినప్పటికీ ఇది రాఘవేంద్రరావు సినిమా కాబట్టి ఒరిజినల్ రైటర్ ఎవరైతే ఉన్నారో ఆయన గొడవ చేయకుండా అతని సైడ్ చేసి అతనికి డబ్బులు ఇచ్చి సెటిల్ మెంట్ చేసినట్టు సమాచారం. కానీ అప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ మీద చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇండస్ట్రీలో చాలామంది రైటర్లు తమ స్టొరీ అని చెప్పుకొని స్టోరీలు వేరే వాళ్ళవి కాపీ చేస్తూ ఉండడం అనేది మనం చాలాసార్లు చూశాం. చిన్ని కృష్ణ లాంటి పెద్ద రైటర్ కూడా మోసం చేయడం చాలా దురదృష్టకరమనే చెప్పాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!