Home » దొంగలు నిర్మించిన దొంగ మల్లన్న ఆలయం దేశంలో ఎక్కడుందో తెలుసా ?

దొంగలు నిర్మించిన దొంగ మల్లన్న ఆలయం దేశంలో ఎక్కడుందో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా భారతదేశం అంటేనే పలు సంస్కృతి, సంప్రదాయాలాలకు నిలయం. ఇక్క భిన్నమతాల వారు ఉన్నప్పటికీ అంతా ఏకత్వంతో ఉంటారు. పురాతన కాలంలో రాజుల కాలంలో దేశవ్యాప్తంగా గుడి, గోపురాలు వంటివి ఎక్కువగా నిర్మించేవారు. వాటిని నిర్మించడం వెనుక చాలా పెద్ద కథనే ఉండేది. ఉదాహరణకు హైదరాబాద్ చార్మినార్, ఆగ్రా తాజ్ మహల్ వంటి వాటి  చరిత్ర గురించి దాదాపు అందరికీ తెలిసిందే. కానీ  ట్విస్ట్ ఏంటంటే..? ఇక్కడ గుడిని దొంగలు కట్టించారట. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీీ ఇది వాస్తవం. దొంగలు కట్టించిన ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి..? అది ఎక్కడ ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

అది మరెక్కడో లేదండోయ్.. తెలంగాణ రాష్ట్రంలోనే ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ప్రస్తుతం జగిత్యాల  జిల్లాలోని గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో ఉన్నటువంటి ఈ శివాలయాన్ని ఇద్దరు దొంగలు ఒక రాత్రిలోనే  నిర్మించాలనుకున్నారట. ఆ గుడి దాదాపు 1000 సంవత్సరాల కాలం క్రితం నాటిది అని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఆ కథ ఏంటంటే..?  ఒకప్పుడు ఇద్దరు దొంగలు ఆ ఊరికి వచ్చి రెండు ఆవుల్ని దొంగతనం చేశారట. ఈ తరుణంలో వారు ఆవులను మేము ఎవ్వరికి  కనిపించకుండా తప్పించుకోగలిగితే గుడి నిర్మిస్తామని అక్కడ ఉన్న శివలింగానికి మొక్కుకున్నారట. ఆ తర్వాత ఆవులు తీసుకొని పారిపోతూ ఉంటే ఆ ఊరు వాళ్లకి ఈ దొంగతనం విషయం తెలిసి వారిని వెంబడించారట. ఆ ఊరి ప్రజలు దొంగల దగ్గరికి రాగానే ఆ ఆవులు రంగు మారిపోయాయట. దీంతో ఇవి మా ఆవులు కావు అని.. ఆ ఊరి ప్రజలు వెనక్కి వెళ్లిపోయారట.

Advertisement

అయితే దొంగలు మొక్కుకున్న విధంగానే శివుడే మమ్మల్ని రక్షించాడని ఆ దొంగలిద్దరూ అనుకున్నట్టుగానే ఒక్క రాత్రిలోనే వారికి తోచిన విధంగా ఆలయాన్ని నిర్మించి పారిపోయారట. ఇక అప్పటి నుంచి ఈ ఊరి వాళ్ళు ఆ గుడిని ఆ స్వామిని దొంగ మల్లన్న గా పిలవడం మొదలుపెట్టారట. ఆ తర్వాత కాలంలో కొంతమంది రాజులు ఆలయాన్ని మరింత అభివృద్ధి  చేశారని చరిత్ర చెబుతోంది.  అయితే కొండూరు వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయి. తెలంగా రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల నుంచి ఈ ఆలయానికి భక్తులు చేరుకుంటారు. జగిత్యాల పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలోనే ఈ ఆలయం ఉంది. ఈ ఆలయంలో శివుడితో పాటు ఇతర దేవతామూర్తులను సందర్శించవచ్చు.ఈ ఆలయానికి ఎన్నో ప్రత్యేకతలు ఉండగా కొత్త కుండలో కొత్త పంటతో బోనం చేసి పూజిస్తే కోరిన కోరికలు తీరతాయని భక్తులు నమ్ముతారు.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading