Home » ప్రభాస్ సలార్ మూవీలో కనిపించే ‘ఖాన్సార్’ ఎక్కడుందో మీకు తెలుసా ?

ప్రభాస్ సలార్ మూవీలో కనిపించే ‘ఖాన్సార్’ ఎక్కడుందో మీకు తెలుసా ?

by Anji
Ad

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాహుబలి సినిమాతో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. బాహుబలి నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. బాహుబలి తరువాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ అవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కానీ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన సలార్ డిసెంబర్ 22న విడుదలై మంచి విజయంతో దూసుకుపోతోంది. 

Advertisement

 

 

ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు మరో కీలక పాత్రలో నటించిన నటుడు పృధ్విరాజ్ సుకుమారన్ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఈ సినిమా మొత్తం ఖాన్సర్ అనే ఒక సిటీ నేపథ్యంలో జరుగుతుంది. ఇప్పుడు ఆ సిటీ మీదే ప్రేక్షకుల కన్ను పడింది.  ఆ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అని గూగుల్ లో  విపరీతంగా వెతుకుతున్నారు. అయితే ఆ సిటీ నిజంగానే ఉందా లేదా అనే దాని మీద చాలా మందికి చాలా రకాల డౌట్లు   వస్తున్నాయి.  ఈ ప్రాంతం ఎక్కడుంది అంటే..? ఇరాన్ లోని ఇస్ఫాహాన్ ప్రావిన్స్ లో ఉంది.  ఇక్కడ 22 వేలకు పైగా పరిషియన్లు నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమాలో చూపించిన ఖాన్సర్ సిటీకి ఇరాన్ లోని ఖాన్సార్ కౌంటి కి అసలు సంబంధమే లేదు. సినిమా కోసం జస్ట్ ఇమాజిన్ తో సృష్టించిన ప్రాంతం మాత్రమే ఇది. అసలు ఆ ప్రాంతానికి దీనికి సంబంధం లేదు. అయితే సలార్ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాంతం ఎక్కడుంది అంటూ గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ సలార్ సినిమా కోసం జస్ట్ ఆ పేరు మాత్రమే వాడుకున్నాడు.  ఇదిలా ఉంటే.. ఈ సినిమా లాంగ్ రన్ లో వెయ్యికోట్లకు పైన వసూళ్లను రాబడుతుందంటూ చాలామంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే రెండు వేల కోట్ల కలక్షన్స్ తో బాహుబలి సినిమా ఇండియాలో నెంబర్ వన్ కలక్షన్లు సాధించిన సినిమాగా ముందు వరుసలో ఉండగా.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి 1000 కోట్ల మార్క్ దాటబోతున్నాడు అంటూ చాలామంది సినీ మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం విశేషం.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading