Home » ఈసారి కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా ?

ఈసారి కార్తీక పౌర్ణమిని ఎప్పుడు జరుపుకోవాలో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అందరూ దేవాలయాలకు వెళ్లి కార్తిక దీపాలు వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు చంద్రుడు వెన్నెల వెలుగులతో విరజింపుతాడు. ఈ ఏడాది కార్తీక పౌర్ణమి రోజు చంద్రగ్రహణం ఏర్పడడం విశేషం. దీంతో ఒక కార్తీక పౌర్ణమి పండుగ జరుపుకోవడం పై చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. కానీ ఇవి ఎరగని రీతిలో ఈసారి చంద్రగ్రహణము ప్రారంభం కావడానికి 9 గంటల ముందే సూతకాలం ఏర్పడుతోంది.

Advertisement

హిందూ పురాణాల ప్రకారం సూత కాలంలో ఎలాంటి పూజలు శుభ కార్యక్రమాలు చేపట్టకూడదు. ఆర్థిక పౌర్ణమి రోజు పూజలు చేయాలనుకునే వారు పూతకాలముకు ముందే పూర్తి చేయాలని పండితులు సూచిస్తున్నారు. సూతకాలము నవంబర్ 8న ఉదయం 8:10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6:19 గంటలకు ముగుస్తుంది. ఉదయం 8 గంటలకు ముందే భక్తులు పూజలు పూర్తి చేసుకోవాలి. అందుకే ఎక్కువగా సోమవారం ఉదయం నుంచే దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. సూతకాలం సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. భగవంతుడిని దర్శనం చేసుకోవడం నిషేధమని వేద పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఇంటి తలుపులు కూడా తెరిచి ఉంచడం అంత మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు.

Advertisement

Also Read :  మీ దంతాలలో రక్తం కనిపిస్తుందా..? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే జాగ్రత్త..!

కార్తీక పౌర్ణమి మనం న్యూస్ స్పెషల్

చంద్రగ్రహణం సమయంలో తినడం తాగడం వంటివి అసలు చేయకూడదు. ముఖ్యంగా మద్యం అసలు సేవించరాదని వేద పండితులు హెచ్చరిస్తున్నారు. గ్రహణం వల్ల ఆధ్యాత్మిక లాభాలు అధికమని గ్రహణము ఎంత మాత్రం కీడు కాదని పలువురు సూచిస్తున్నారు. సూతకాల సమయంలో చూచి శుభ్రత స్నాన దానాలు తర్పణాలు ఆహార నియమాలు పాటించడం చాలా మంచిదని పేర్కొంటున్నారు.

Also Read :  ఈ మూడు పేర్లు ఉన్న అమ్మాయిలు నెం.1 భార్యలు.. వీరున్నచోట సంపదకు లోటుండదు..!

Visitors Are Also Reading