అలనాటి హీరోయిన్ రాధా కూతురు తమిళ హీరోయిన్ కార్తీక త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టుగా ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కినేని నాగచైతన్య ఫస్ట్ మూవీ జోష్ తో ఆమె టాలీవుడ్ కు పరిచయం అయింది. అయితే ఈ బ్యూటీ తెలుగులో చాలా తక్కువ సినిమాలే చేసిందనే చెప్పాలి. కోలీవుడ్ లో కూడా ఆమె పెద్దగా సినిమాలేవి చేయలేదు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఆమె నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. అయితే ఈ బ్యూటీ కి సౌత్ లో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో ఆ తర్వాత బిజినెస్ వైపు అడుగు లేచింది.
Advertisement
సినిమాలకు దూరమైనప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు తన ఫోటోలను పోస్ట్ చేస్తూ నిరంతరం అభిమానులతో టచ్ లోనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా కార్తీక నిశ్చితార్థం జరిగిందంటూ.. తన ఎంగేజ్మెంట్ పిక్స్ ని షేర్ చేసింది. దాదాపు 8 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ సడన్ గా ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యింది అంటూ పిక్స్ షేర్ చేయగానే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో కార్తీక తన భర్త ముఖాన్ని మాత్రం చూపించలేదు. కొన్ని రోజులు తనకు కాబోయే భర్త ఎవరన్న విషయాన్ని సస్పెన్స్ లో ఉంచిన కార్తీక ఆయన ముఖాన్ని రివీల్ చేసింది.
Advertisement
తనకు కాబోయే భర్తకు సంబంధించిన ఫోటోను తాజాగా పోస్ట్ చేసింది. హీరోలకు ఏమాత్రం తీసుకుపోకుండా హ్యాండ్సమ్ గా ఉన్న ఆ అబ్బాయి ఫోటోను షేర్ చేస్తూ నిన్ను కలవడం విధి, నీతో ప్రేమలో పడడం మాత్రం ఒక మ్యాజిక్, నీతో కలిసి జీవితం పంచుకోవడానికి కౌంట్ డౌన్ స్టార్ట్ చేశాను అంటూ రాసుకు వచ్చింది. ఇక కార్తీక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి పేరు రోహిత్ మీనన్ అని.. అంతేకాకుండా అతను కోలీవుడ్ స్టార్ హీరో కార్తి కి, ఇటు నేచురల్ స్టార్ నానికి క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ప్రస్తుతం కార్తీక రోహిత్ మీనన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!