Home » మొలతాడుకు మగవారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

మొలతాడుకు మగవారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా?

by Anji
Ad

మొలతాడు కట్టని వాడు అసలు మగవాడే కాదు అని మన పెద్దలు పేర్కొంటుంటారు. అయితే మొలతాడుకు, మగతనానికి మధ్య ఉండే సంబంధాలు ఏంటి అని తెలుసుకుంటే మనకు చాలా ఆసక్తి కర విషయాలు అర్థమవుతాయి. ముఖ్యంగా హిందూ మతంలో మగవారంతా మొలతాడు కట్టుకుంటారు. దీనిని కట్టుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటో ఎవరికీ అర్థం కాదు.. ఇలాంటి సందేహాలు అందరికీ ఏదో ఒక సందర్భంలో వస్తాయి. అయితే ఏవి ఎలా ఉన్నా చిన్న పిల్లల విషయంలో నిక్కరు జారిపోతుందనే కారణంతో కడుతుంటారు. ప్రధానంగా చిన్న పిల్లలకు ఉయ్యాలలో వేసే సందర్బంలో వారికి వెండి మొలతాడు అట్టహాసంగా కడుతుంటారు.

Advertisement

ఆ తరువాత నడుముకు నల్లని తాడును కడతారు. చిన్ని కృష్ణుడికి బంగారు మొలతాడు ఉండేది అని అందరూ చెబుతుంటారు. దీనిని పరిశీలిస్తే.. మనకు పురాతన కాలం నుంచి కూడా ఇలా నడుముకు మొలతాడు కట్టుకునే సంప్రదాయం ఉందని అర్థమవుతోంది. నల్లని తాడును నడుు చుట్టూ కట్టడం వల్ల దుష్ట శక్తుల ప్రభావం ఉండదు అని పెద్దలు చెబుతుంటారు. వేదాలలో మనకు కొన్ని జీవిసూత్రాలు ఉన్నాయి. స్నానం చేసే సమయంలో పూర్తి నగ్నం ఉండకూడదని.. శరీరంపై కనీసం చిన్న గుడ్డ అయినా   ధరించాలని చెబుతుంటారు. ఆడపిల్లలకు చిన్నప్పుడు సిగ్గుబిళ్ల కడుతుంటారు. వారికి పెళ్లి సమయంలో మంగళసూత్రం ధరిస్తారు. ఇదే సమయంలో మగవారికి మొలతాడు చాలా ముఖ్యమనే భావన ఉంది. మరణించినప్పుడు మగవారికి మొలతాడును తీసేస్తారు. 

Advertisement

దీనిని పవిత్రంగా భావించడం వల్ల ఇలా చేస్తారు. మొలతాడు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మనం తినే ఆహారం కడుపులోకి వెళ్లేటప్పుడు ఫుడ్ కంట్రోల్ గా ఉచండంతో సహాయపడుతుంది. ఫలితంగా ఎంత బరువు పెరుగుతున్నారో తెలుస్తుంది. అంతేకాదు.. శరీరంలో ఎంత వేడి ఉందో గ్రహిస్తుంది. శరీరంలో అధిక వేడి ఉంటే వృషణాల్లో శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతుంది. దీని ఫలితంగా సంతానోత్పత్తి సమస్యలు ఏర్పడుతాయి. అందుకే మొలతాడు కట్టకపోతే వాడు మగవాడు కాదని అంటుంటారు. దీని వెనుక ఇంత పరమార్థం దాగి ఉంది. అందుకే మగవాళ్లు మొలతాడు కట్టాలి అంటారు మన పెద్దలు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆలీ చేసిన సూపర్ హిట్ మూవీని వదలుకున్న మహేష్ బాబు ?

కాంగ్రెస్ తరపున నాటు నాటు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పోటీ.. ఆ నియోజకవర్గం నుంచేనా ?

Visitors Are Also Reading