Home » కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్‌ చేస్తున్నారో తెలుసా?

కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్‌లో ఎక్కువగా ఏం సెర్చ్‌ చేస్తున్నారో తెలుసా?

by Anji
Published: Last Updated on
Ad

ప్రస్తుతం రోజు రోజుకు టెక్నాలజీ  విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తరువాత  చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను వినియోగిస్తున్నారు. ఉదయం  నిద్ర లేచినప్పటి నుంచి  రాత్రి పడుకోబోయే వరకు చాలా మంది తమ తమ స్మార్ట్‌ఫోన్‌లలోని ఇంటర్నెట్‌లో మునిగి తేలుతున్నారు. ఎవ్వరికీ ఏది కావాలన్నా.. గూగుల్ తల్లి ఉండనే ఉంది.  దేని గురించి తెలుసుకోవాలంటే వెంటనే గూగుల్‌ను నమ్ముకుని చిటికెలోనే వెతికేస్తున్నారు. ప్రపంచంలో ఏ మూలనా ఏం జరుగుతుందో క్షణాల్లోనే తెలుసుకునే సదుపాయం ఉంది.

Advertisement

ఇక చిన్నారుల నుంచి పెద్దల వరకు గూగుల్‌ను నమ్ముకుని తమకు కావాల్సిన అంశాలను సెర్చ్‌ చేస్తున్నారు.  నిమిషాల వ్యవధిలోనే తమకు కావాల్సిన సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. తాజాగా నిర్వహించిన గూగుల్‌ సెర్చింగ్‌ సర్వేలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే వివరాల ప్రకారం.. గూగుల్‌లో రకరకాల విషయాలపై సెర్చ్‌ చేస్తున్నట్లు సర్వే చెబుతోంది. ఇక కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు గూగుల్ లో ఏం  వెతుకుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోక మానదు. చాలా మంది కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు తన భర్తను ఏ విధంగా ఆకట్టుకోవాలి..? తన భర్త భార్య మాట వినాలంటే ఏం చేయాలి..? అనే విషయాలను వెతుకుతున్నారట. అంతేకాదండోయ్‌.. అత్తగారిని సైతం ఎలా ఆకట్టుకోవాలి.. తన వైపు ఎలా తిప్పుకోవాలి..అనే విషయాలపై గూగుల్‌లో ఎక్కువ సెర్చ్‌ చేస్తున్నట్లు సర్వేలో తేలింది.

Advertisement

 

  మరో  ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే పిల్లలు పుట్టడానికి ఏ సమయంలో భార్యాభార్తలు కలవాలి.. అనే విషయాన్ని కూడా గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారట. ఇలా ఈ ఏడాది కొత్తగా పెళ్ళైన మహిళలు రకరకాలు విషయాలపై గూగుల్‌లో సెర్చ్‌ చేస్తున్నారని సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. ఒకప్పుడు ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఇతరుల నుంచి, పెద్దల నుంచి తెలుసుకోవాల్సి ఉండేది. కానీ రానురాను టెక్నాలజీ పెరుగుతున్న కారణంగా గూగుల్‌ తల్లిని నమ్ముకోవడం గమనార్హం.

Visitors Are Also Reading