Home » ఆధార్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ వల్ల‌ ఉప‌యోగం ఏంటో మీకు తెలుసా..?

ఆధార్ కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ వల్ల‌ ఉప‌యోగం ఏంటో మీకు తెలుసా..?

by Anji
Ad

ప్ర‌స్తుతం ఎలాంటి ప్రభుత్వ సంబంధిత పనికైనా ఆధార్ తప్పనిసరి.. ఆధార్ లేని మనిషి లేడు.. రోజు ఎన్నో అవసరాలకు ఆధార్ కార్డును వాడుతుంటాం.. కానీ ఎప్పుడైనా దాని పైన ఉన్న బార్ కోడ్ ను గమనించారా..? అసలు ఎందుకు ఉందో తెలుసా.. నిజానికి ఆధార్ కార్డు పైన ఉండే వివ‌రాల క‌న్నా ఆ బార్ కోడ్ మీద ఉండే వివ‌రాలే ఎక్కువట..ఈ క్యూ ఆర్ కోడ్ లో మీ పేరు, పుట్టినతేదీ, జెండర్, ఫోటో వంటి ఇతర వివరాలు అన్నీ ఉంటాయి. ఇవేకాకుండా క్యూఆర్ కోడ్ లో మెయిల్, మొబైల్ నెంబర్ వంటివి వివరాలు కూడా ఇందులో ఉంటాయి. కానీ ఆధార్ కార్డులో ఇవి ఉండవు.

Advertisement

ఆధార్ కార్డు వెనుక భాగంలో ఉన్న క్యూ ఆర్ కోడ్ ను స్కాన్ చేయడంవల్ల ఐడెంటిటీని వెరిఫై చేయవచ్చు.యూఐడిఏఐ అధికారిక మొబైల్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం మీరు ఆధార్ క్యూఆర్ స్కానర్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి.ఎప్పుడైనా ఆన్ లైన్ లోనే ఆధార్ ఐడెంటిటీని వెరిఫై చేసుకోవడానికి ఆధార్ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుందని యుఐడిఎఐ ట్విట్టర్ వేదికగా ఎప్పుడో తెలియజేసింది. ఆధార్ క్యూఆర్ కోడ్ స్కానర్ ను డౌన్ లోడ్ చేసుకొని ఈ సేవలో పొందొచ్చని పేర్కొంది. ఆధార్ కార్డు మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. ఆధార్ కార్డు నిజమైందా? కాదా? అందులోని వివరాలు కరెక్ట్ గా ఉన్నాయా? లేదా? అనే విషయాన్ని ఈ ఆప్షన్ ద్వారా చాలా సులభంగా క్షణాల్లో తెలుసుకోవచ్చు.

Advertisement

Also Read :  ఈ ల‌క్ష‌ణాలు క‌లిగిన అబ్బాయిల‌ను అమ్మాయిలు ఇష్ట‌ప‌డ‌తార‌ట‌…ఆ ల‌క్ష‌ణం ఖ‌చ్చితంగా ఉండాల‌ట‌..!

చాలా మంది ఆధార్ కార్డు ను నకిలీ చేస్తారు. ఫోటో, అందులో వివరాలు మార్చేస్తారు. కానీ క్యూఆర్ కోడ్ ను మాత్రం మార్చలేరు. కాబట్టి.. ఒక ఆధార్ కార్డు నకిలీదా లేదా అని తెలుసుకోవాలంటే ఈ క్యూఆర్ కోడ్ ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డు ఉపయోగించి ఎన్నో మోసాలకు తెరలేపొచ్చు. ఆధార్ కార్డే కదా అని ఎవరికి పడితే వారికి అస్సలు ఇవ్వకూడదు. మనకు ఉన్న పెద్ద యూనిక్యూ ఆస్తులు ఆధార్, ఫింగర్ ప్రింట్స్ మీ దగ్గర ఉన్నవి సేమ్ మరెవరి దగ్గర ఉండవు.

Also Read :  ఈ అక్ష‌రాల‌తో పేరు క‌లిగిన పిల్ల‌లు చాలా తెలివైన వారు.. చ‌దువులో ఫ‌స్ట్‌..!

Visitors Are Also Reading