హిందూ మతంలో తులసి మొక్క చాలా పవిత్రమైందిగా భావించి పూజిస్తారు. తులసి మొక్కను ఇంట్లో సరైన దిశలో నాటాలని కూడా వాస్తు శాస్త్రం చెబుతోంది. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఎప్పుడూ సుఖ, సంతోషాలు ఉంటాయని చెబుతారు.ఈశాన్యం తులసికి ఉత్తమ దిశగా సూచించబడింది. తులసి పూజకు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. కొన్ని ప్రత్యేక రోజుల్లో తులసిని ఇంటికి తీసుకురావడం మంచిది. కొన్ని రోజుల్లో తులసిని ముట్టుకోకూడదని చెబుతారు. అయితే ఇలాంటి పవిత్ర మొక్క తులసిని ఎవ్వరికైనా బహుమతిగా ఇవ్వడం సరైనదేనా..? అన్న సందేహం చాలా మందికి ఉంటుంది.
Advertisement
వాస్తును విశ్వసిస్తే.. ఎవ్వరికైనా బహుమతిగా ఇవ్వడం సరైనదేనా..? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. వాస్తును విశ్వసిస్తే.. ఎవ్వరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి హిందూ మతంలో ఓ పవిత్రమైన మొక్క. ఇంటికి శ్రేయస్సును తెస్తుంది. ఇది సానుకూలతను ఆకర్షిస్తుంది. ఇంట్లో వాస్తు ప్రకారం.. తులసి మొక్కను ఉంచడానికి ఉత్తమమైన ప్రదేశం ఈశాన్యదిశ. తులసి మొక్కను గౌరవించే వారికి బహుమతిగా ఇస్తే.. మీ ఇంటికి చాలా శుభప్రదమని చెబుతారు. గాలిని శుద్ధి చేయడానికి, ప్రతికూల శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి సహాయపడుతుంది. తులసి మొక్కను తాకడం నిషేదించబడి రోజున ఈ మొక్కను ఎవ్వరికీ దానం చేయకూడదని.. బహుమతిగా ఇవ్వకూడదని గుర్తుంచుకోండి. ఉదాహరణకు ఆదివారం, ఏకాదశి రోజు తొలిరోజు తులసిని ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకండి. ఆ రోజుల్లో తులసిని అవమానించకుండా జాగ్రత్త వహించండి. ఎవరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే.. ఆ మొక్కను ఆరోగ్యంగా చక్కగా సంరక్షించడం మీ విధి.
Advertisement
ఇందుకోసం మొక్క పరిణామానికి తగిన తొట్టిని కూడా ఎంచుకోవాలి. ఎండిన మొక్కను ఎప్పుడూ బహుమతిగా ఇవ్వకూడదు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. జ్యోతిష్యాన్ని విశ్వసిస్తే తులసి మొక్కను బహుమతిగా ఇవ్వడం వల్ల మీ ఇంటికి శ్రేయస్సు లభిస్తుంది. ఇతరుల ఇంటికి మీరు సానుకూల శక్తిని ప్రసారం చేస్తారు. తులసి శాంతికి చిహ్నం. ఇంట్లో సమారస్య వాతావరణాన్ని అందిస్తుంది. మీరు ఎవరికైనా తులసిని బహుమతిగా ఇస్తే.. అది మీ ఇంటి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. వాస్తు ప్రకారం.. తులసి మొక్క చాలా పవిత్ర మైంది. మతపరమైన పండుగలు, పుట్టిన రోజులు, వివాహాలు, గృహ ప్రవేశాలు లేదా ఏదైనా ఇతర సామాజిక కార్యక్రమాల్లో సమర్పించడానికి అనుకూలంగా ఉంటుంది. తులసి మొక్కను బహుమతిగా ఇచ్చినప్పుడు దానిని ఇంట్లో సరిగ్గా పెట్టుకొని సంరక్షించాలి. తులసి మొక్కను బహుమతిగా ఇచ్చే ముందు.. దానిని బాగా శుభ్రం చేసి అందమైన కుండీలో బహుమతిగా ఇవ్వండి. మీరు ఎవ్వరికైనా తులసి మొక్కను బహుమతిగా ఇస్తే.. దాని నియమాలను పాటించండి. తద్వారా ఇంట్లో ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :