సాధారణంగా అందరూ ఎంతో ఇష్ట పడి తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. పనస పండు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. పనస పండుతో ఒక్కటేంటీ చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. వేసవిలో తినే వాటిల్లో పనస పండు కూడా ఒకటి. ఇందులో కూడా వాటర్ కంటెంట్, ఫైబర్ శాతం అధికంగా ఉంటుంది. ఎలాంటి వారైనా పనస పండును తినొచ్చు. పనస పండులోని ప్రతి భాగంలో కూడా చాలా పోషకాలు ఉంటాయి. పనస కాయ, పనస తొనలు, పనస గింజలు ఇలా అన్నింటినీ తినొచ్చు. అయితే ముఖ్యంగా పనస పండు తినడం వల్ల మగవారికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
పనస తొనలు తినడం వల్ల మగవారిలో సంతానోత్పత్తి శక్తి పెరుగుతుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. సంతానం లేక బాధ పడుతున్న వారు పనస పండును తింటే మంచి ఫలితాలు ఉంటాయి. పనసలో ఫైటోన్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స క్యాన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే తగ్గుతాయి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!