సాధారణంగా మనం తినే ఆహారాలు, తాగే పానీయాలకు సంబంధించి చాలా మంది చాలా రకాల అపోహలు ఉన్నాయి. వాటి గురించి మన చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ చాలా విషయాల్లో అసలు లాజిక్ తెలుసుకోకుండానే కన్క్లూజన్కి వచ్చేస్తుంటాం. ఫలితంగా అది నిజమో.. అబద్ధమో పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ మిస్ అవుతుంటాం. కొన్ని విషయాలు తరం నుంచి మరో తరానికి బదిలీ అవుతుంటాయి. కానీ వాటి వెనుక ఉన్న అసలైన కారణం మాత్రం ఎవరికీ తెలియదు. అలాంటి ఒక అపోహ ఏమిటంటే.. చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని అంటుంటారు. అలా చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ప్రధానంగా చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని అంటుంటారు. ఎందుకంటే మాంసాహారం తిన్న తర్వాత పాలు తాగడం వల్ల శరీరంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని.. అందుకే చికెన్ లేదా మటన్ తిన్న తర్వాత పాలు తాగకూడదని కొందరూ చెబుతారు. అయితే వాస్తవానికి నిపుణులు ఏం చెబుతున్నారంటే.. చికెన్ లేదా మటన్ తిన్నాక భేషుగ్గా పాలు తాగొచ్చు. ఎందుకంటే వీటి రెండింటి మధ్య ఎలాంటి ప్రతికూల సంబంధం లేదు. వీటి కలయిక వల్ల ఎలాంటి ప్రతికూల ప్రతిచర్యలు జరిగినట్లు శాస్త్రీయ ఆధారాలు లేవు. నిజానికి.. ఈ రెండింటిలో అధిక మొత్తంలో ప్రోటీన్ ఉంటుంది. అందువల్ల చికెన్, మటన్ తిన్న తర్వాత పాలు తాగితే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.
కానీ ఎలాంటి సమస్యలు తలెత్తవని డాక్టర్లు బుతున్నారు. అదేవిధంగా చాలా మంది ఆల్కహాల్ సేవించిన తర్వాత వెంటనే పాలు తీసుకోకూడదని చెబుతుంటారు. కానీ వెంటనే కాకుండా కొంత సమయం తర్వాత పాలు తీసుకోవచ్చు. ఎందుకంటే మద్యం సేవించిన తర్వాత పాలు తీసుకోవడం వల్ల ఆమ్లత్వం తగ్గి ఆరోగ్యానికి సహకరిస్తుంది. కొంత మందికి పాల ఉత్పత్తులు, మాంసాన్ని కలిపి తినడం వల్ల జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి శరీర తత్వాన్ని బట్టి ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ఉత్తమం. కొందరికి జీర్ణశక్తి పరిమితంగా ఉండడం వల్ల ఒకేసారి అంతగా జీర్ణం అవ్వదు. దీంతో జీర్ణ సమస్యలు, అజీర్తి సమస్యలు వస్తాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల వచ్చే రియాక్షన్‌కి.. దీనిని లింక్ చేయడం తగదు. అదేవిధంగా పుల్లని పండ్లు తిన్న తర్వాత పాలు తీసుకోవడం వల్ల మాత్రం కొన్ని సమస్యలు వస్తాయట. కాబట్టి నారింజ, నిమ్మ, పైనాపిల్ వంటి పుల్లని పండ్లు తిన్న తర్వాత వెంటనే పాలు తాగడం మానుకోవడం ఉత్తమం.