గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. పోలీస్ కాప్ స్టోరీతో రూపొందుతున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమాలో లాగే ఇందులోనూ స్టైలిష్ పోలీస్ గా కనిపించనున్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ అమితంగా ఆకట్టుకున్నాయి.
Advertisement
అలాగే ఉస్తాద్ కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నాడు డైరెక్టర్ హరీష్ శంకర్. ఇదిలా ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త బాగా చెక్కర్లు కొడుతోంది. పవన్ సినిమా నుంచి డైరెక్టర్ హరీష్ శంకర్ తప్పుకున్నాడని టాక్ వినిపిస్తోంది. జనసేన అధ్యక్షులుగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో, ఉస్తాద్ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అందుకే హరీష్ శంకర్ ఈ సినిమా నుంచి వైదొలిగాడంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి. అలాగే పవన్ సినిమా స్థానంలో రవితేజతో ఓ మూవీకి హరీష్ ప్లాన్ చేస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Advertisement
ఈ క్రమంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై వస్తున్న పుకార్లపై స్పందించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి తాను తప్పుకోవడం, రవితేజతో సినిమా చేయబోతుండడం రెండు అబద్ధమేనని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఈ ఆవేశమే తగ్గించుకుంటే మంచిది అంటూ ఇలాంటి రూమర్లు సృష్టిస్తున్న వారికి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు డైరెక్టర్. తద్వారా పవన్ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పెట్టాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సినిమాలో సీనియర్ నటి గౌతమి అశుతోష్ రాదా కే జి ఎఫ్ సేమ్ అవినాష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు చాలా భాగం వరకు ఈ మూవీ షూటింగ్ పూర్తయిన ట్లు సమాచారం.
మరిన్ని టాలీవుడ్ న్యూస్ కోసం ఇవి చూడండి. తెలుగు న్యూస్ కోసం వీటిని వీక్షించండి.