Home » కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ గురించి మీకు తెలుసా ?

కోడి రామకృష్ణ హెడ్ బ్యాండ్ వెనుక దాగి ఉన్న సీక్రెట్ గురించి మీకు తెలుసా ?

by Anji
Published: Last Updated on
Ad

టాలీవుడ్ దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. మన టాలీవుడ్ కి ఎన్నో మరపురాని హిట్లు అందించారు. ముఖ్యంగా దేవుళ్లు, దేవి, అరుంధతి, అంకుశం, మంగమ్మగారి మనవడు ఇలా ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు గుర్తుకు వస్తాయి. కోడిరామకృష్ణ పేరు చెబితే హిట్ సినిమాలే కాదు.. మరొకటి కూడా గుర్తుకొస్తుంది. అది ఆయన నుదిటి పై ఉండే బ్యాండ్.

Advertisement

kodiramakrishna
ఎప్పుడూ ఆయన బ్యాండ్ కట్టుకునే కనిపిస్తారు. అసలు ఆయనకు ఆ బ్యాండ్ కట్టుకోవడం ఎలా అలవాటు అయిందంటే..? రెండో సినిమా తరంగిణి షూటింగ్ కోవలం బీచ్ వద్ద జరుగుతోంది. మధ్యాహ్నం కావడంతో ఎండ బాగా ఉంది. అదే సమయంలో ఎన్టీఆర్ కాస్ట్యూమర్ మేకా రామారావు అక్కడికి వచ్చి మీ నుదురు విశాలంగా ఉంది. ఎండ ఎక్స్ పోజర్ అవుతుంది అంటూ ఒక జేబు రుమాలు ఇచ్చి కట్టుకోమన్నారట. అలా కోడి రామకృష్ణ రోజు అంతా రుమాలు కట్టుకొని ఉన్నారు. మరుసటి రోజు కూడా మేకా రామారావు ఎంట్రీ ఇచ్చారు. ఈసారి రుమాలుని బ్యాండ్ లా తయారు చేసుకొని తెచ్చి.. దీనికి మీకు ఏదో బంధం ఉందండి.. అందరికీ మ్యాచ్ అవ్వదు.. మీకు బాగా సూట్ అయింది. దీనిని కట్టుకోకుండా ఉండొద్దని కోడి రామకృష్ణకు ఇచ్చారట. అలా అప్పటి నుంచి షూటింగ్ సమయంలో బ్యాండ్ కట్టుకోవడం ఆయనకు అలవాటుగా మారింది.

Advertisement

Also Read :  RRR తరహాలోనే జక్కన్న ప్లాన్.. మహేష్ ని కంట్రోల్ చేసేందుకే..!

Visitors Are Also Reading