దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. బాహుబలి, RRR వంటి సినిమాలతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు. రాజమౌళి దర్శకత్వం ద్వారా మంచి హిట్ కొట్టాడు. కానీ ఆ సినిమాకు కథ అందించేది తన తండ్రి రైటర్ విజయేంద్ర ప్రసాద్. ఆయన రాజన్న అనే సినిమాకు దర్శకత్వం కూడా అందించాడు. జక్కన్న సినిమాలతో విజయేంద్ర ప్రసాద్ కి ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. బాలీవుడ్ డైరెక్టర్లు, నిర్మాతలు సైతం విజయేంద్ర ప్రసాద్ వద్దకు వచ్చి స్టోరీస్ గురించి అడుగుతున్నారు అంటే ఆయనకు ఏ రేంజ్ లో గుర్తింపు లభించిందో ఇక మనం అంచనా వేయవచ్చు.
Advertisement
ఇదిలా ఉండగా విజయేంద్ర ప్రసాద్ కేవలం రాజమౌళి చిత్రాలకు మాత్రమే కథలు అందించడం లేదు. బజరంగీ భాయి జాన్ సక్సెస్ తర్వాత మణికర్ణిక లాంటి మరో సూపర్ హిట్ సినిమా స్టోరీని కూడా అందించారు. అంతేకాకుండా సీత ది ఇన్ కారినేషన్ అనే మూవీ బాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో చేస్తున్నారు. వీటితో పాటుగా జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబు, కాంబోలో రాబోయే పాన్ వరల్డ్ కథపై కూడా దృష్టి పెట్టారట. ఇప్పుడు ఆ స్టోరీకి సంబంధించిన వర్క్ కూడా జరుగుతోందని తెలుస్తోంది. అలాంటి విజయేంద్ర ప్రసాద్ కు అత్యధికంగా రెండు కోట్ల రూపాయల పారితోషకం అందుకోవడం చాలా అరుదు.
Advertisement
వందల కోట్ల సినిమా చేసిన రైటర్ కి వచ్చే రెమ్యూనరేషన్ మాత్రం తక్కువగానే ఉంటుంది. అయితే విజయేంద్ర ప్రసాద్ మాత్రం, రైటర్ గా కథ ఇవ్వడం కోసం ఏకంగా ఐదు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై అత్యధిక పారితోషకం అందుకునే వ్యక్తిగా విజయేంద్ర ప్రసాద్ పేరు సంపాదించుకున్నారు. ఈ విధంగా విజయేంద్ర ప్రసాద్, రాజశేఖర్ కు చాలా డిమాండ్ పెరిగిపోయింది. కథ బాగుంటే నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్ పెట్టి కూడా సినిమాలు చేయడానికి వెనకడుగు వేయడం లేదు. ఇదే సందర్భంలో విజయేంద్ర ప్రసాద్ రెమ్యూనరేషన్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!