చెన్నై ఫిలిం ఇండస్ట్రీ చాలా మంది టెక్నిషియన్స్‌తో పాటు చాలా పెద్దగా ఉండేది. 1980లో తమిళ సినిమాలకు ధీటుగానే తెలుగు సినిమాలు చాలానే విడుదలయ్యేవి. ఆ తరువాత తెలుగు సినీ పరిశ్రమ తమిళనాడు నుంచి హైదరాబాద్ మార్చిన తరువాత ఇండస్ట్రీలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీ కోసం అప్పటి స్టార్ హీరోలు అయినటువంటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ చాలా కృషి చేశారు. వీరితో పాటు దర్శక నిర్మాతలు డి.రామానాయుడు, దర్శకరత్నదాసరి నారాయణరావు ఇండస్ట్రికీ కొత్త రూపాన్ని ఇచ్చారు.
అక్కినేని ఫ్యామిలీ అన్నపూర్ణ స్టూడియోస్, కృష్ణ ఫ్యామిలీ పద్మాలయ స్టూడియోస్ ప్రారంభించారు. చాలా ప్రొడక్షన్ హౌస్ లు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు సక్సెస్ ఫుల్‌గా కొనసాగుతుంది సురేష్ ప్రొడక్షన్స్. అప్పట్లో సినిమాలకు చాలా తక్కువ ఖర్చు అయ్యేది. అదేవిధంగా స్టార్ హీరోలకు కూడా కోట్లలో రెమ్యునరేషన్ ఉండేది కాదు. ఎన్టీఆర్ సినిమాలకు 50లక్షలు అధిక బడ్జెట్ ఉండేది. కేవలం ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే అప్పట్లో ఎక్కువ బడ్జెట్ సినిమాలు ఉండేవి. సౌత్ ఇండస్ట్రీలో పారితోషికం ఎన్టీఆర్ టాప్‌లో ఉండేవారు. ఆయన ఒక్క సినిమాకు రూ.12లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవారట.
Advertisement
Advertisement
ఇక ఆ తరువాత ఏఎన్నార్ సినిమాలకు 30 నుంచి 40 లక్షలు ఖర్చు అయ్యేదట. ఏఎన్నార్ ఒక్కో సినిమాకు రూ.10లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవారట. కృష్ణ సినిమాలకు 20 నుంచి 30 లక్షల వరకు ఖర్చు అయ్యేది. కృష్ణ 7లక్షలు రెమ్యునరేషన్ తీసుకునేవారట. అదేవిధంగా శోభన్‌బాబు సినిమాలకు 20 నుంచి 25 లక్షలు బడ్జెట్ అయ్యేది. ఆయన రెమ్యునరేషన్ 6 నుంచి 7 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవారట. అప్పట్లో హీరో సుమన్‌కు కూడా ఇండస్ట్రీలో చాలా ఫాలోయింగ్ ఉండేది. ఆయన చిత్రాలకు రూ.17లక్షల బడ్జెట్ అయ్యేది. ఆయన రూ.3లక్షలు పారితోషికం తీసుకునేవారట. చిరంజీవి సినిమాలకు రూ.17లక్షలు బడ్జెట్ అయ్యేది. చిరంజీవి 3 నుంచి 4 లక్షల వరకు పారితోషికం తీసుకునేవారట. మొత్తానికి అందరికంటే ఎక్కువగా రెమ్యునరేషన్ ఎన్టీఆర్ తీసుకోవడం విశేషం.
Also Read :
రాజమౌళి ఆస్తుల విలువ అన్ని కోట్లా…? ఆయనదగ్గర ఉన్న ఈ ఖరీదైన వస్తువుల గురించి తెలుసా..?
నటి పవిత్ర లోకేష్ మొదటి భర్త ఎవరంటే ? ఆయనతో ఉన్న వివాదం అదేనా ?