తెలుగు వారు జరుపుకునే అతి పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజుల పాటు జరుపుకునే సంబరాల పండుగ. మొదటి రోజున’ భోగి పండగగా.. రెండవ రోజున మకర సంక్రాంతి గా… మూడో రోజున కనుమగా మూడు రోజులు పాటు కొందరు జరుపుకుంటే మరికొన్ని ప్రాంతాల్లో నాల్గో రోజున ముక్కనుమగా కూడా జరుపుకుంటాం. మొదటి పండగ భోగి.. అంటే ‘తొలిరోజు అని అర్ధం. ఈ రోజున తెల్లవారు జామునే ఇంటి ముంగిట భోగి మంటలు వేస్తారు. భోగి అనే మాట.. భాగ అనే పదం నుంచి వచ్చిందని అంటారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్ధం.
Advertisement
దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దూరం అవటం వల్ల భూమిపై చలి పెరుగుతుంది. ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు రోజు ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ చలిని తట్టుకునేందుకు ప్రజలు వేడి కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు. ఈ మంటలు వేయడం వలన భోగీ అనే పేరు వచ్చింది. మరికొందరు ‘భుగ్’ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖంని అర్ధం ని చెబుతారు. ఈరోజున శ్రీ రంగనధస్వామిని గోదాదేవి వివాహం చేసుకుని ఆయనలో లీనమై భొగాన్ని పొందిందని దీనికి సంకేతంగా భోగి పండగ మొదలైందని పురాణ గాధ.
Advertisement
భోగి పండగ వెనుక ఆరోగ్య రహస్యం :
- భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నెల రోజులూ ఇంటి ముందు ఆవు పేడతో పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని భోగి పిడకలు అని అంటారు. వీటిని దండగా గుచ్చి భోగి రోజున వేసిన మంటల్లో వేస్తారు.
- ఇలా దేశి ఆవు పేడతో చేసిన పిడకలు మంటలో కలడం వలన గాలి శుద్ధి అవుతుంది.
- సూక్ష్మక్రిములు నశిస్తాయి.
- భోగి మంట కోసం ఎక్కువగా మామిడి, రావి వంటి ఔషధ గుణాలున్న చెట్ల కొమ్మలను ఉపయోగిస్తారు. మంటను వేసే ముందు కట్టెలు త్వరగా అంటుకోవడానికి ఆవు నెయ్యిని నెయ్యని జోడిస్తారు.
- ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదలయ్యే గాలి అతి శక్తివంతమైంది.
- ఈ శుభ్రమైన గాలి మన శరీరంలోని 72 వేల నాడులలోకి ప్రవేశించి శరీరాన్ని శుభ్ర పరుస్తుంది.
- భోగి మంటలను అగ్నిదేవుడిని ఆరాధనగా పరిగణిస్తారు.