Home » అక్కినేని అమల తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినవారో మీకు తెలుసా..?

అక్కినేని అమల తల్లిదండ్రులు ఏ దేశానికి చెందినవారో మీకు తెలుసా..?

by Sravanthi
Ad

అక్కినేని అమల అంటే తెలియని తెలుగు ప్రజలు ఉండరు. ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ” హలో గురు ప్రేమకోసమే ” అనే సాంగ్ ఇప్పటికి కూడా ట్రెండ్ లో ఉంటుంది. ఆ పాటలో ఆమె చూపించిన అందం అభినయం అలాంటిది.

Advertisement

అందుకే ఇప్పటికీ ఆ పాట చెక్కుచెదరకుండా ఉంది. అయితే అమల నాగార్జునను వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. బ్లూ క్రాస్ అనే జంతువుల సంరక్షణ కేంద్రాన్ని స్థాపించి మూగ జీవుల పై ప్రేమను చాటుకుంటున్నారు అమల.1986లో సినీ ప్రేక్షకులకు పరిచయమైన అమల టి. రాజేందర్ దర్శకత్వం వహించిన టువంటి మిథిళీ ఎమ్మాయ్ కథలి అని మూవీ లో మొదటిసారిగా నటించి భారీ సక్సెస్ అందుకుంది.

ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత యాభై చిత్రాలు చేసి విపరీతంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఇందులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలే ఉన్నాయి. ఆమె మలయాళంలో చేసిన కొన్ని చిత్రాలకు ఉత్తమ నటిగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా లభించింది . ఆమె నాగార్జునతో కలిసి శివ వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. కానీ అప్పటికి నాగార్జున వెంకటేష్ సోదరి లక్ష్మీ తో పెళ్లయింది. ఎప్పుడైతే అమలుపై ప్రేమ పెంచుకున్నారో ఆ క్షణమే లక్ష్మికి విడాకులు ఇచ్చారు.

Advertisement

ఇక నాగార్జున పెళ్లి చేసుకున్న తర్వాత అమలా పూర్తిగా హైదరాబాద్ వచ్చేశారు. వివాహం తర్వాత అమల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ మనం లాంటి రెండు సినిమాల్లో నటించారు. కానీ అందులో పాత్రలు కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే అమల తండ్రి బెంగాలీ నేవీ ఆఫీసర్.. తల్లి ఏమో ఐర్లాండ్ దేశానికి చెందినటువంటి మహిళ. ఈ విధంగా అయన నేవీ ఆఫీసర్ గా చేస్తున్న సమయంలో డిప్యూటేషన్ మీద కరాగ్ పూర్ ఐఐటీలో ప్రొఫెసర్ జాబ్ సంపాదించారు. అమల తల్లి మైహౌ కూడా జాబ్ చేసేది. పెళ్లి తర్వాత వీరిద్దరూ చెన్నై మరియు వైజాగ్ వంటి ప్రదేశాల్లో చాలా కాలం ఉన్నారు.

also read;

స్టేజీపై పూర్ణ‌తో ఆ జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ ఏమి చేసాడో తెలుసా..?

భార్య ఇంట్లో లేనప్పుడు భర్త చేసే పనులు ఏంటో తెలుసా..?

 

Visitors Are Also Reading