Home » నాగచైతన్య ‘తండేల్’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా..?

నాగచైతన్య ‘తండేల్’ టైటిల్ అర్థం ఏంటో తెలుసా..?

by Anji
Ad

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. జోష్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఇంట్రీ ఇచ్చాడు. రెండో సినిమా ఏమాయ చేశావే సినిమాలో హీరోయిన్ గా నటించిన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత విడాకులు కూడా తీసుకున్నారు. విడాకుల తరువాత నాగచైతన్య సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నాడు. కానీ ఆయనకు ఆశించిన మేరకు హిట్ సినిమాలు రావడం లేదనే చెప్పవచ్చు.  ఓ వెబ్ సిరీస్ కూడా చేస్తున్నాడు నాగచైతన్య. 

Advertisement

ఇదిలా ఉంటే..  అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం తండేల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా విజయం కోసం నాగచైతన్య ఎంతో కష్టపడుతున్న విషయం అందరకిీ తెలిసిందే. ప్రస్తుతం అతని ఆశలన్నీ ఈ సినిమా మీదనే పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో చైతన్య జాలరుడిగా కనిపించనున్నాడు. గుజరాత్ తీరంలో సముద్ర జలాల్లో చిక్కుకున్న శ్రీ కాకుళానికి చెందిన జాలరి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు చందు మొండేటి.

Advertisement


ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే టైటిల్ రిలీజ్ అయిన తర్వాత అసలు తండేల్ అంటే ఏంటి ? అని అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక ఈ మధ్యనే చందు మొండేటి టైటిల్ కి అర్థం ఏంటో చెప్పుకొచ్చాడు. గుజరాత్ భాషలో తండేల్ అంటే బోటు ఆపరేటర్ అని.. అందుకే ఆ పేరును టైటిల్ గా పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇప్పుడంటే ఆ పదాలు అందరికీ కొత్తగా ఉంటాయి. కానీ ఒకప్పుడు అందరూ బోటు ఆపరేటర్ ను తండేల్ అనే పిలిచేవారని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ సినిమా కోసం చైతన్య ఎంతో కష్టపడుతున్నాడు. ఫిట్ నెస్ తో పాటు మృత్యకారులు ఎలా ఉంటారు అనే దాన్ని ఎంతో దగ్గర ఉండి చూసి నేర్చుకుంటున్నాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో వేచి చూడాలి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading