Home » టాలీవుడ్ లోని టాప్ హీరోల ఫస్ట్ పారితోషికం ఎంతో తెలుసా..? 

టాలీవుడ్ లోని టాప్ హీరోల ఫస్ట్ పారితోషికం ఎంతో తెలుసా..? 

by Anji
Ad

ఎన్టీఆర్-ఏఎన్నార్ కాలంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి. హీరో, హీరోయిన్లు దర్శక, నిర్మాతలు ఏది చెబితే అది చేసేవారు. వారు ంత పారితోషకం ఇస్తే అంతే తీసుకునేవారు. ప్రధానంగా నటనపై దృష్టి పెట్టేవారు తప్ప పారితోషికం గురించి అంతగా ఆలోచించేవారు కాదట. అలా ఓరేంజ్ వచ్చే వరకు పారితోషికంలో డిమాండ్ అంటూ ఏం ఉండేది కాదట. ప్రస్తుతం కాలం మారింది. హీరోలకు కాస్త స్టార్ డమ్ వస్తే కోట్లాది రూపాయలు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. తెలుగు మూవీ ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోలుగా కొనసాగుతున్న కొంతమంది హీరోల మొదటి రెమ్యూనరేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

మెగాస్టార్ చిరంజీవి : 

manam news

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తొలుత నటించినటువంటి ఫస్ట్ మూవీకి రూ.1116 పారితోషికం తీసుకున్నారట. ప్రస్తుతం ఆయన ఒక్కో మూవీకి రూ.50 నుంచి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారట. 

మహేష్ బాబు :

సూపర్ స్టార్ కృష్ణ నటవారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగారు మహేష్ బాబు. ఈయన నటించినటువంటి ఫస్ట్ మూవీ రాజకుమారుడు మూవీకి రూ.10లక్షలు రెమ్యూనరేషన్ తీసుకున్నాడట మహేష్ బాబు. 

అల్లు అర్జున్ :

Manam News

Advertisement

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపు సాధించినటువంటి అల్లు అర్జున్ పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ గా ఎదిగారు. అలాంటి ఆయన తొలి సినిమాకు రూ.100 కోట్లు పారితోషికం అందుకున్నారట. ప్రస్తుతం ఒక్కో మూవీకి రూ.80 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట. 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ :

Manam News

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈయన తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్రానికి రూ.5లక్షల రెమ్యూనరేసన్ అందుకున్నారు. 

ప్రభాస్ :

ప్రస్తుతం ప్రతీ పాన్ ఇండియా లెవెల్ లో తీస్తూ దేశ వ్యాప్తంగా స్టార్ గా ఎదిగినటువంటి ప్రభాస్ తొలి సినిమాకే రూ.5లక్షల రెమ్యూనరేషన్ అందుకున్నారట.

విజయ్ దేవరకొండ :

రౌడీ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్ దేవరకొండ సినిమాలోకి రాక ముందు ట్యూషన్ లు చెప్పేవారట. ఈయన తొలుత సంపాదించినటువంటి అమౌంట్ రూ.500 ఇక ఆ తరువాత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి లైఫ్ ఈజ్ బ్యూటిపుల్ మూవీలో నటించారు. ఈ చిత్రానికి ఆయన అసలు అమౌంట్ తీసుకోలేదట. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ చక్రవ్యూహం.. ఎక్కడ చూడొచ్చంటే..?

ప్రముఖ కమెడియన్ యోగిబాబు ఒక్కరోజు పారితోషికం ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Visitors Are Also Reading