వ్యాయామం చేయాలంటే మనం ముందు దాని గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా బురువు తగ్గాలనుకునేవారు. తొందరగా బరువు తగ్గాలంటే ఎప్పుడు వ్యాయామం చేస్తే మంచిదో తెలుసా. దీని మీద తాజాగా ఒబేసిటీ జర్నల్ ఓ అధ్యయనాన్ని ప్రచురించింది. దాని ప్రకారం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేస్తే ఎఫెక్టివ్‌గా బరువు తగ్గుతారని తేల్చి చెప్పింది. ఈ అధ్యయనంలో 2003-2006 మధ్యకాలంలో నేషనల్ హెల్త్ & న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే లో పాల్గొన్న 5285 మందిని.. ఈ అధ్యయనం కోసం క్రాస్-ఎనలైజ్ చేశారు.
Advertisement
పరిశోధకులు వారిని మూడు సమూహాలుగా విభజించారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. మోడరేట్-టు-వైగరస్ ఫిజికల్ యాక్టివిటీ స్థాయి, స్థూలకాయంతో కూడిన రోజువారీ నమూనా రిలేషన్‌ను పరిశీలించారు. ఉదయం పూట వ్యాయామం చేసేవారిలో ఇతర గ్రూప్‌లవారి కంటే ఎక్కువ బరువు తగ్గినట్టు గుర్తించారు. నడుము చుట్టుకొలత తక్కువ ఉన్నట్లు గుర్తించారు. ఉదయం వ్యాయామం చేసేవారు ఆరోగ్యకరమైన డైట్‌ను కూడా ఫాలో అవుతున్నారని, శరీర బరువు యూనిట్‌కు తక్కువ రోజువారీ శక్తిని తీసుకుంటారని చెబుతున్నారు.
Advertisement
ఉదయం పూట గ్రూప్‌లలో వారికి.. ఇతర గ్రూప్‌లతో పోలిస్తే శారీరక శ్రమలో తక్కువగా పాల్గొన్నట్లు అధ్యయనంలో తేలింది. శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పటికీ.. వారి శరీర ద్రవ్యరాశి సూచిక, నడుము చుట్టుకొలత తగ్గిందని పేర్కొన్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మునుపటి అధ్యయనం శారీరక శ్రమ తీవ్రత, ఫ్రీక్వెన్సీ, వ్యవధి అనే మూడు అంశాలపై దృష్టి పెట్టింది. ఎలా చూసినా కూడా ఉదయం 7 నుంచి 9 లోపు వ్యాయామాు చేసే వారు తొందరగా బరువు తగ్గుతున్నారని తేలింది. దీని ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య వ్యాయామం చేయడం అలవాటు చేసుకుంటే మనం బరువు తగ్గవచ్చు. దీంతో మంచి ఫలితం ఉంటుంది. ఇక నుంచి ప్రయత్నించండి.. ఆరోగ్యంగా ఉండండి.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!