Home » ప్రతిరోజు పరిగడుపున జీలకర్ర వాటర్ తాగితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

ప్రతిరోజు పరిగడుపున జీలకర్ర వాటర్ తాగితే కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా జీలకర్రను మనం వంటల్లో వాడుతుంటారు. ఆహారానికి సువాసనతో పాటు రుచిని కూడా తీసుకొస్తుంది. జీలకర్ర అద్భుతమైన ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఆరోగ్యంతో పాటు అందాన్ని ఇచ్చే జీలకర్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు చూద్దాం. ఒక గ్లాసు నీటిలో రెండు లేదా మూడు స్పూన్లు జీలకర్ర వేసి బాగా మరిగించి వడకట్టి నీటిని ప్రతి రోజు ఉదయం పూట త్రాగటం వలన ఆరోగ్యమైన ప్రయోజనాలు పొందవచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Advertisement

ముఖ్యంగా జీలకర్ర జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ఆకలిని పెంచుతుంది. కడుపులో ఏర్పడే అల్సర్లు నివారిస్తుంది. జీవక్రియల ఫలితంగా ఏర్పడే వ్యర్ధాలను బయటకి పంపడంలో సహాయపడుతుంది. కడుపులో ఉండే పరాన్న జీవులను నివారిస్తుంది. జీలకర్ర రక్తంలోని చక్కర నిల్వలు క్రమబద్ధీకరిస్తుంది. అధిక రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని రక్త సరఫరా వ్యవస్థను మెరుగుపరిచి గుండెకు రక్త సరఫరా సాఫీగా అందేలా సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మ సమస్యలను నివారిస్తుంది. చర్మంపై ఏర్పడే ముడతలు మరియు పొడిబారే సమస్యలను తగ్గిస్తుంది.

Advertisement

Also Read :   తులసి మొక్కను ఇంట్లో పెంచుకోవడానికి అసలు కారణం ఎంతో తెలుసా ?

చర్మానికి కావలసిన పోషకాలను అందించి ముఖానికి నిగారింపుని ఇస్తుంది. మూత్రశయం సమస్యలను తగ్గిస్తుంది. జీర వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీలో ఏర్పడే రాళ్లు సైతం కరుగుతాయని ఆయుర్వేద నిపుణులు చెప్తారు. శరీరంలోని హానికరమై ట్యాక్సన్ లను బయటకి పంపుతుంది. ప్రేగులలో ఏర్పడిన వ్యర్థాలను తొలగిస్తుంది. కడుపులో ఏర్పడే వికారం మరియు కడుపు ఉబ్బరంగా ఉండే సమస్యలను నివారిస్తుంది. అంతేకాకుండా అతిగా వచ్చే త్రేన్పుల సమస్యలను తగ్గిస్తుంది. ఉదర ఆరోగ్యాన్ని పెంచుతుంది. మొలల వ్యాధి నుంచి ఉపశమనానికి కలిగిస్తుంది. శరీరంలో ఏర్పడే అనారోగ్యం తొలగిస్తుంది. జలుబు, దగ్గులను తగ్గిస్తుంది. మలబద్ధకం మరియు గ్యాస్ సమస్య తగ్గించడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. బరువు తగ్గి ఎందుకు కూడా జీలకర్ర అమోఘంగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Also Read :  జలుబు చలికాలంలోనే ఎందుకు వస్తుంది.. దీనికి అసలు కారణం ఇదేనా ?

Visitors Are Also Reading