Home » యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

యాదమ్మ రాజుకి కాబోయే భార్య బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా ?

by Anji
Ad

Yadamma Raju wife Name, Photos, Background: పటాస్ కమెడియన్ యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవలే ఇతను స్టెల్లా తో ప్రేమాయణం కొనసాగించారు. వీరి ప్రేమ పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే వరకు వెళ్లింది. తాజాగా వీరి నిశ్చితార్థం కూడా  ఘనంగా నిర్వహించారు. బంధువులు, స్నేహితుల మధ్య వీరి నిశ్చితార్థం ఘనంగా నిర్వహించారు. 

Yadamma Raju wife

Yadamma Raju wife

యాదమ్మరాజు అనుకోకుడా బుల్లితెర పైకి వచ్చాడు. జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలు ఎంత పాపులర్ అయ్యాయో అప్పట్లో పటాస్ కామెడీ షో కూడా అంతే క్రేజ్ సంపాదించుకుంది. ఓ సారి పటాస్ కార్యక్రమంలో స్టూడెంట్ గా షోలో అడుగుపెట్టిన రాజు ఓ జోక్ వేసి హైలెట్ అయ్యాడు. రాజు బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ బాగుండడంతో పటాస్ షో లో కామెడీ చేసే అవకాశం లభించింది. ప్రస్తుతం కమెడీయన్ గా పేరు తెచ్చుకున్న సద్దాం.. నూకరాజు, ఫైమా ఇమ్మాన్యుయేల్ ఇలాంటి వారందరూ పటాస్ షో నుంచి వచ్చిన వారే. స్టెల్లాతో ప్రేమలో ఉన్నట్టు యాదమ్మ రాజు ఓ సమయంలో ప్రోగ్రాం మధ్యలో ఆమెను స్టేజీ పైకి తీసుకొచ్చి మరీ అందరికీ పరిచయం చేశాడు యాదమ్మ రాజు.  అదేవిధంగా వీరిద్దరూ కలిసి కొన్ని యూట్యూబ్ వీడియోలు కూడా చేస్తున్నారు. 

Advertisement

  యాదమ్మరాజు -స్టెల్లా నిశ్చితార్థం ఫోటోలలో పెళ్లి కూతురు స్టెల్లాకి నుదుటిపై బొట్టు కూడా లేదట. యాదమ్మ రాజు హిందువు.. స్టెల్లా క్రిస్టియన్ కావడంతో వీళ్లు ఏదో ఆ యాదమ్మ రాజు బొడ్డు కోసి పెంచినట్టుగా.. ‘ఏరా రాజుగా.. మొత్తానికి తల్లిదండ్రుల పుట్టు పూర్వోత్తరాలు వారి సాంప్రదాయాలు అన్ని గాలికి వదిలేసి కేవలం ఒక ఆడదాని కోసం మతం మారినవ్.. ముఖానికి ఇంత బొట్టు కూడా లేదు రాజుగా సిగ్గు లేదు నీకు’ అంటూ తిట్టడం  ప్రారంభించారు. కొంత మంది ఈ నిశ్చితార్థం చూసి వీళ్ల ఎంగేజ్ మెంట్ ఫోటోలు చూసి తెగ కుళ్లుకుపోతున్నారు. ముఖ్యంగా యాదమ్మ రాజు ఆగస్టు 22, 2020 జీ తెలుగులో బాపు బొమ్మకు పెళ్లంట అనే వినోద కార్యక్రమంలో తన ప్రేయసిని పరిచయం చేశాడు. ఇక అప్పటి నుంచి అప్పటి నుంచి వీరి ప్రేమ ప్రయాణం సాగుతూ.. ప్రస్తుతం నిశ్చితార్థం వరకు వచ్చింది. 

Also Read :   పెళ్లి చేసుకోబోయే అమ్మాయి, అబ్బాయి మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలో తెలుసా..?

Visitors Are Also Reading