సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరో, హీరోయిన్ ..అవ్వాలని వచ్చి.. ఇండస్ట్రీ లో ఫేమ్ లేక అవకాశాలు రాక కూలీలుగా మిగిలిన వారు చాలా ఎక్కువ. సినిమా అంటే లక్ .. అదృష్టం వచ్చినా దానిని నిలబెట్టుకునే ధైర్యం కూడా ఉండాలి. అన్ని కుదిరి అవకాశాలు రావాలి అప్పుడే నిన్ను నువ్వు తెర మీద చూసుకోగలవు. ఇలా కూలీగా వచ్చిన వ్యక్తి ఇప్పుడు బిజీ ఆర్టిస్ట్ అంటే నమ్ముతారా..?
Advertisement
శమంతకమణి, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100, జార్జ్ రెడ్డి, జాంబి రెడ్డి, భీమ్లా నాయ్ సినిమాలు మీసాల లక్ష్మణ్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. మంగళవారం మూవీతో మరింత గుర్తింపు వచ్చింది. కళ్లు కనిపించని వ్యక్తిగా బాగా యాక్ట్ చేశారు లక్ష్మణ్. నాటక రంగం నుంచి వచ్చిన ఆయన సుమారు 25కు పైగా సినిమాల్లో నటించాడు. హీరో స్నేహితుడిగా, విలన్‌గా వివిధ పాత్రల్లో మెరిశాడు.
Advertisement
ఒక ఇంటర్వ్యూలో మీసాల లక్ష్మణ్ తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని విషయాలను పంచుకున్నాడు. ‘నేను పదో తరగతి తర్వాత చదువుకోలేదు. సినిమాల్లోకి రాక ముందు ఎన్నో పనులు చేశాను. రోజు కూలీగా పనిచేశాను . అల్లు అర్జున్ ఇంటి నిర్మాణానికి కూడా కూలీగా పని చేశాను. అయితే పని చేస్తున్నప్పుడు తెలియదు కానీ.. నిర్మాణం పూర్తైన తర్వాత అది అల్లు అర్జున్ ఇళ్లని తెలిసింది. ఎస్వీ కృష్ణారెడ్డి గారి ఇంటి పని కూడా చేశాను. చాలా కష్టాలు పడ్డాకే ఈ అవకాశాలు దక్కాయంటూ చెప్పుకొచ్చారు లక్ష్మణ్.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!