Home » దర్శకులుగా కాకముందు వీరు సినిమాల్లో నటించారనే విషయం మీకు తెలుసా ?

దర్శకులుగా కాకముందు వీరు సినిమాల్లో నటించారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ లో చాలా మంది దర్శకులు తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరిన తరువాతే దర్శకులుగా మారారు. అలా అసిస్టెంట్ దర్శకులుగా తమ కెరీర్ ప్రారంభించిన తెలుగు చలన చిత్ర దర్శకులు.. ప్రముఖ పాత్రల్లోకి మారడానికి ముందు అప్పుడప్పుడూ తమ చిత్రాలతో నటన పాత్రలు కూడా పోషిస్తున్నారు.  అయితే దర్శకులుగా కాకముందు సినిమాల్లో నటించిన దర్శకులు చాలా మందే ఉన్నారు. వారు ఎవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

నాగ్ అశ్విన్ :

టాలీవుడ్ దర్శకుడు నాగ్ అశ్విన్  దర్శకుడిగా కాక ముందు తొలుత శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు. లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటీ పుల్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇక ఆ తరువాత ఇంగ్లీషులో యాదోం కీ బరాత్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తెలుగులో ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలకు దర్శకత్వం వహించాడు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ఇక  ప్రాజెక్ట్ కే కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా పాన్ వరల్డ్ లేవల్ లో విడుదల కాబోతుంది. 

అనిల్ రావిపూడి : 

అనిల్ రావిపూడి 2008లో జె.శివకుమార్ దర్శకత్వం వహించిన శౌర్యం సినిమాలో నటించాడు.  ఇతని బాబాయ్ అరుణ్ ప్రసాద్ కూడా దర్శకుడే. పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు చిత్రానికి ఆయనే దర్శకుడు. 2005లో విడుదలైన గౌతమ్ ఎస్.ఎస్.సీ సినిమాకి సహాయకుడిగా పని చేశాడు అనిల్ రావిపూడి.  ఆ తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు. 

వంశీ ఫైడిపల్లి : 

దర్శకుడు  వంశీ పైడిపల్లి వర్షం సినిమాలో నటించాడు.  ఈశ్వర్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు.  వర్షం, భద్ర, మాస్ వంటి సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక 2007లో ప్రభాస్ హీరోగా నటించిన మున్నా చిత్రానికి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

గోపిచంద్ మలినేని : 

Advertisement

డైరెక్టర్ గోపిచంద్ మలినేని స్టాలిన్ సినిమాలో నటించారు. రియల్ స్టార్ హీరోగా శ్రీహరి నటించిన పోలీస్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. అప్పటి నుంచి శ్రీను వైట్లతో వెంకి, అందరివాడు, ఢీ సినిమాలు.. మురగదాస్ దర్శకత్వంలో స్టాలిన్, మెహర్ రమేష్ తెరకెక్కించిన కంత్రి, బిల్లా వంటి సినిమాలకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. రవితేజ హీరోగా నటించిన డాన్ శీను సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

సందీప్ రెడ్డి వంగ : 

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ 2010లో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన కేడీ సినిమాలో నటించాడు. ఈయన దర్శకుడిగా కాక ముందు కేడీ, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసాడు. ఇక ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా నటించిన  అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు సందీప్ రెడ్డి వంగ.

శ్రీకాంత్ అడ్డాల : 

డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ నటించిన ఆర్య మూవీలో నటించాడు. ఈయన దర్శకుడిగా కాక ముందు ఆర్య 2, బొమ్మరిల్లు వంటి సినిమాలకు అసిస్టెంట్ దర్శకుడిగా పని చేశాడు. ఈయన పనితనం నచ్చి నిర్మాత దిల్ రాజు దర్శకుడిగా అవకాశం ఇచ్చాడు. కొత్త బంగారు లోకం సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించాడు.

హరీష్  శంకర్  : 

దర్శకుడు  హరీష్ శంకర్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన అందరివాడు సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు.  నిన్నే ఇష్టపడ్డాను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక ఆ తరువాత రవితేజ వీడే సినిమాకు మాటల రచయితగా వ్యవహరించాడు. ఆటోగ్రాఫ్ సినిమాకి కూడా అసిస్టెంట్ గా పని చేశాడు. ఆ తరువాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ షాక్ సినిమాకి దర్శకత్వం వహించమని అవకాశం కల్పించాడు. రవితేజ హీరోగా నటించిన మిరపకాయ్ సినిమాకి దర్శకత్వం వహించాడు. అప్పటి నుంచి డైరెక్టర్ గా మంచి సక్సెస్ సాధించాడు.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading