సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఓ నటుడు చేయాల్సిన క్యారెక్టర్ ఒక్కోసారి మరో నటుడికి వెళ్తుంది. అలా ఆ క్యారెక్టర్ ని మిస్ చేసుకొని బాధపడిన నటులు చాలా మంది ఉన్నారు. ఎందుకు అంటే వారు వద్దనుకున్న పాత్ర మిగతా నటులు చేసినప్పుడు వారికి మంచి స్టార్డమ్ వస్తుంది. ఆ సమయంలో ఎందుకు వద్దనుకున్నాం రా అంటూ బాధపడే క్షణాలు చాలా మందికి ఎదురు అవుతాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీనా చేయాల్సిన పాత్రను రోజా కూడా చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఆ విషయం గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం.
Advertisement
హీరోయిన్ రోజా తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన కథానాయిక. ప్రస్తుతం ఆమె రాజకీయాల్లోకి కూడా ఆరంగేట్రం చేసి మంత్రిగా కొనసాగుతోంది. అలాంటి రోజా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో చాలా ఇబ్బందులు పడిందట. రాజేంద్ర ప్రసాద్ హీరోగా వచ్చిన ప్రేమ తపస్సు అనే సినిమాలో తెలుగు సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అయితే సినిమాలో రోజా యాక్టింగ్ బాగున్నా కానీ.. అవకాశాలు మాత్రం రాలేదు. ఇదే నేపథ్యంలో శోభన్ బాబు హీరోగా సర్పయాగం అనే మూవీ చేస్తున్నారు.
Advertisement
ఇందులో శోభన్ బాబు కూతురుగా మీనాని సెలెక్ట్ చేశారు. కానీ సినిమాలో ఆ పాత్ర చనిపోయేది. అప్పుడప్పుడూ మీనా హీరోయిన్ స్టేటస్ తెచ్చుకుంటుంది. ఆ పాత్ర చేస్తే బాగుండదని ఆమె తప్పుకుంది. దీంతో పరుచూరి బ్రదర్స్ అందులో ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకోవాలని ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రోజా గురువు శివ ప్రసాద్ పరుచూరి బ్రవర్స్ ని కలిసి ప్రేమ తపస్సు సినిమా చూడాలని చెప్పారట. ఇందులో రోజా యాక్టింగ్ గమనించిన వారు ఈ అమ్మాయి బాగా సెట్ అవుతుందని భావించ సర్పయాగం మూవీలో ఛాన్స్ ఇచ్చారట. దీంతో ఈ పాత్ర చాలా పేరు తీసుకొచ్చింది. అప్పటినుంచి రోజాకి చాలా సినిమాల్లో హీరోయిన్ ఛాన్స్ లు వచ్చాయి. అలా తొందరలోనే స్టార్ హీరోయిన్ గా మారింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
మేము విడిపోయామని ఎలా అనుకుంటారు..? హేమా మాలిని కామెంట్స్ వైరల్..!