Home » ఆ దర్శకుడు అన్న మాటలకు ఎఎన్ఆర్ కన్నీరు పెట్టుకున్నారనే విషయం మీకు తెలుసా ?

ఆ దర్శకుడు అన్న మాటలకు ఎఎన్ఆర్ కన్నీరు పెట్టుకున్నారనే విషయం మీకు తెలుసా ?

by Anji
Ad

ఎన్టీఆర్, ఏఎన్నార్  అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ప్రధాన పిల్లర్లలాగా ఉండేవారు. ఇండస్ట్రీ ఈ పొజిషన్ లో ఉంది అంటే వీరి కష్టం ఎంతగానో ఉందని చెప్పవచ్చు. అలాంటి తెలుగు సినిమా ఇండస్ట్రీకి అక్కినేని నాగేశ్వరరావు  1941లో ధర్మపత్రి  అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రానికి డైరెక్టర్ పీ.పుల్లయ్య. అయితే ఈ సినిమా చేసే సమయానికి ఏఎన్ఆర్ కి 17 సంవత్సరాలు. అప్పుడే నాటకారం నుంచి సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. అయితే ఇదే క్రమంలో ధర్మపత్ని షూటింగ్ విరామ సమయంలో పీ.పుల్లయ్య ఏఎన్ఆర్ ను దారుణంగా అవమానించారట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

Advertisement

 ఏఎన్ఆర్ నాటక రంగం నుంచి వచ్చారు కాబట్టి విరామ సమయం దొరికినప్పుడల్లా ఆయనను పద్యాలు చెప్పమని అడిగేవారు. దీంతో ఏఎన్ఆర్ చాలా లయబద్ధంగా క్లియర్ గా పద్యాలు చెప్పేవారు. అయితే ఒక రోజు షూటింగ్ విరామ సమయంలో అందరూ నటీనటులంతా ఒక్క కాడ మాట్లాడుకుంటున్నారు. ఇంతలో పుల్లయ్య  అక్కినేనినీ అందరి ముందు ఒక పద్యం పాడమన్నారు. అక్కినేని ఏమనుకోకుండా అందరి ముందే ఒక పద్యాన్ని ఎత్తుకున్నాడు. అయితే ఈ పద్యం గతంలో చాలా సార్లు పాడిన పద్యం కనుక పుల్లయ్య ప్రతిసారి ఇదే పద్యం పడతావ్ ఏంట్రా అంటూ అనకూడదని ముతక మాట అందరి ముందు అనేసాడట.

Advertisement

దీంతో అవమానంగా ఫీల్ అయిన అక్కినేని నాగేశ్వరరావు  కంట్లో నీళ్లు వచ్చాయట. అదే బాధతో దగ్గరలో ఉన్న మెరీనా బీచ్ కి వెళ్లి ఇసుక తిన్నలపై నిలబడి చాలాసేపు ఏడ్చారట. కట్ చేస్తే 13 సంవత్సరాలు ఇండస్ట్రీలో గడిచింది. అక్కినేని సూపర్ స్టార్ అయ్యారు. ఇంతలో 1954 అర్ధాంగి  సినిమాకు ఏఎన్ఆర్ పాత్ర కోసం ఆయన దగ్గరికి వచ్చారు. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడిగా ఏఎన్ఆర్ చేయాలి. కథ అంతా వివరంగా చెప్పి అన్న పాత్రలో ఎన్టీఆర్  అనుకుంటున్నాను, తమ్ముడి పాత్రలో నువ్వు చేస్తే బాగుంటుందని అన్నారట. నెగిటివ్ రోల్ నీకు కూడా కొత్తగా ఉంటుందనీ అన్నారట. ఈ మాటలు విన్న ఏఎన్ఆర్ వెంటనే ఎందుకులెండి మళ్లీ లొకేషన్ లో అందరి ముందు మీరు అంటూ ఆ ముతక మాటను ప్రస్తావించారంట. దీంతో షాక్ అయిన పుల్లయ్య.  ఓరి నీ దుంప తెగ అప్పుడంటే చిన్న పిల్లాడివి చనువుకొద్ది అనేసాను.. ఇంకా గుర్తుపెట్టుకున్నావ్ ఏంట్రా అంటూ ఆశ్చర్యపోతూ మాట్లాడడట. 

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading