కొత్త బంగారులోకం చిత్రంలో ఎక్కడికి అనే అనే ప్రేక్షకులకు మంచి వినోదం పండించిన నటి శ్వేతా బస గురించి అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో శ్వేత నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఈ సినిమా చేసే టైం కి ఆమె వయసు కేవలం 17 యేళ్లు మాత్రమే. ఇప్పటికీ ఆమె చాలా మెచ్యూర్డ్ గా ఈ సినిమాలో నటించింది. కొత్త బంగారు లోకం సినిమా తర్వాత శ్వేతా కొన్ని సినిమాలు చేసినప్పటికీ అవి ఆశించిన మేర ఆకట్టుకోలేదని చెప్పాలి. ఈ మధ్యలో ఆమె పోలీసులకు పట్టుబడడం, ఆ తర్వాత బాలీవుడ్ కి సినిమాలు చేయడం, అనంతరం దర్శకుడు రోహిత్ మిట్టల్ నీ పెళ్లి చేసుకోవడం అన్ని చకచకా జరిగిపోయాయి. బ్రేకప్ తర్వాత స్పందించిన శ్వేత బసు తమ బంధం కేవలం ఎనిమిది నెలల్లోనే ముగిసిపోతుందని కలలో కూడా ఊహించలేద చెప్పుకొచ్చింది. దూరంగా ఉన్నా విడిపోయిన కచ్చితంగా మళ్ళీ ఆయన దర్శకత్వంలో కలిసి పనిచేస్తానని నమ్మకం ఉందని కూడా అప్పట్లో చెప్పడం గమనార్హం. శ్వేతా బసు కొత్త బంగారులోకం సినిమా సమయంలో చాలా లావుగా ఉండగా.. ప్రస్తుతం మాత్రం గుర్తుపట్టలేని విధంగా కనిపించడం విశేషం. అప్పటికంటే ఇప్పుడు శ్వేత చాలా క్యూట్ గా ఉందని నెట్టిజెన్స్ కామెంట్లు చేస్తున్నారు. Also Read : PONNIYAN SELVAN REVIEW : “పొన్నియన్ సెల్వన్” సినిమా రివ్యూ….బాహుబలిని బీట్ చేసిందా..?
Advertisement
Advertisement
శ్వేతాబసు మళ్లీ సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం శ్వేతా బసు ప్రసాద్ జస్టిస్ సీజన్ 3 లో కనిపిస్తుంది. ఇందులో ఆమె పబ్లిక్ ప్రాసిక్యూటర్ లేఖ పాత్రలో నటిస్తోంది. పంకజ్ త్రిపాఠి రోల్ మాధవ్ మిశ్రా తో పోటీపడింది. బాల నటిగా పలు సినిమాలు చేసిన శ్వేత బసు మక్డీలో తన పాత్రకు ఉత్తమ బాలనటిగా జాతీయ చలనచిత్రం అవార్డును గెలుచుకుంది. ఇక ఒకటి రెండు సినిమాల్లో కూడా నటించనున్నట్లు సమాచారం. Also Read : Krishnam Raju Samsmarana Sabha : మరోసారి మనసు చాటుకున్న ప్రభాస్..!