సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన లెటెస్ట్ మూవీ జైలర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా రజినీకాంత్ అభిమానులకు కాస్త షాక్ ఇచ్చిందనే చెప్పాలి. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. తమిళ రాక్ స్టార్ అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు యూట్యూబ్ ద్వారా ఇతర స్ట్రీమింగ్ ఫ్లాట్ ఫామ్ లలో సెన్షేషన్ క్రియేట్ చేస్తుండగా.. ఈ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.
సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. డార్క్ యాక్షన్ చిత్రాలను మంచి ఎమోషన్ తో తెరకెక్కించగలిగే నైపుణ్యం ఉన్న దర్శకుడు నెల్సన్ ఈ సినిమాను యాక్షన్ ప్రధానంగా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. సెంట్రల్ జైలులో ఓ ముఠా నాయకుడిని తప్పించడానికి వివిధ గ్రూపులు చేసే ప్రయత్నాన్ని.. ఓ సాధారణ జైలు వార్డెన్ ఎలా ఎదుర్కొన్నాడనే పాయింట్ తో నెల్సన్ ఈ సినిమాను రూపొందించినట్టు సమాచారం.మరోవైపు రజినీకాంత్ తమ సినిమాలతో ఎన్నో ఏళ్లుగా అలరిస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం వయస్సు మీద పడుతున్నప్పటికీ అదే ఎనర్జీతో వరుస సినిమాలను చేస్తూ దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్.
దాదాపు 2గంటల 49 నిమిషాల నిడివి కలిగిన జైలర్ మూవీ లాక్ అయింది. ఈ సినిమా పోస్టర్స్ లో టీజర్ లో చూపించినట్టుగా వైలెన్స్ ప్రధానంగా ఉండబోతుందనుకుంటే పొరపాటే. సినిమా అసలు ఆ జోనర్ లోనే కాకుండా కాన్సెప్ట్ ప్రధానంగా సాగుతున్నట్టు సెన్సార్ టీమ్ వెల్లడిస్తూ రజినీ అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ సినిమా గురించి సెన్సార్ ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టింది. ఫ్యామిలీ మొత్తం కలిసి చూసేవిధంగా జైలర్ సినిమా ఉండబోతుందని తెలియజేస్తూనే ఈ చిత్రానికిU/A సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో రజినీ అభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే మాత్రం ఆగస్టు 10 వరకు వేచి చూడాల్సిందే.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
ఉపాసనపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన రామ్ చరణ్..! ఇంతకీ ఏం జరిగిందంటే..!
కాజల్ వ్యవహారాలన్నీ చూసుకునేది ఆమె భర్త కాదట.. ఎవరంటే..?