సింగర్ శ్రీరామ్ పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తన గాత్రంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాడు. సిద్ శ్రీరామ్ పాటలతో ఎంతో మంది ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తుంటాడు. చిన్న, పెద్ద సినిమాల్లో సిద్ శ్రీరామ్ పాడిన పాటలు ఉంటే.. ఇక అవి తప్పకుండా హిట్ అవ్వాల్సిందే అని మేకర్స్ విశ్వసించే వరకు అతడి గాత్రం వెళ్లింది.
Advertisement
తమిళనాడులో పుట్టి అమెరికాలో పెరిగిన శ్రీరామ్ తెలుగులో తనదైన శైలిలో పాటలు పాడుతూ.. శ్రోతలను ఆకట్టుకుంటున్నాడు. డియర్ కామ్రెడ్ సినిమాతో మొదలైన సిద్ తెలుగు పాటల ప్రస్థానం పుష్ప వరకు కొనసాగుతూనే ఉన్నది. మాటే వినదుగా సామజవరగమనా నుంచి ఇటీవల వచ్చిన పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ వరకు అన్ని సూపర్ హిట్ సాంగ్సే కావడం విశేషం.
Advertisement
అతను పాడిన పాటలు యూట్యూబ్ షేక్ అవ్వాల్సిందే. దక్షిణాది ఫిల్మ్ ఇండస్ట్రీలలో ఉన్న టాప్ మోస్ట్ సింగర్లలో ఒకరిగా సిద్ శ్రీరామ్ దూసుకుపోతున్నాడు. ఇదిలా ఉండగా.. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో శ్రీరామ్ పాటల హవా కొనసాగుతుంది. ఆయన ఒక్కపాటకు తీసుకునే రెమ్యునరేషన్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సిద్ శ్రీరామ్ ఒక్కపాటకు రూ.5లక్షల నుండి రూ.7లక్షల వరకు తీసుకుంటాడని టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఇంత పెద్ద మొత్తంలో సింగర్స్ రెమ్యునరేషన్ తీసుకోవడం చాలా అరుదు. ప్రస్తుతం సిద్ శ్రీరామ్ కు ఉన్న క్రేజ్ మామూలుగా లేదు. అతను పాట పాడితే రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది తెలిసి మేకర్స్ సైతం రెమ్యునరేషన్ అంత మొత్తం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు.