టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జునకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్న నాగార్జున సినిమాలకు మార్కెట్ కూడా ఇప్పటికీ బాగానే ఉంది. కానీ ఇటీవల కాలంలో ట్రెండ్ ను ఫాలో అవుతూ సినిమాలు చేయడంలో ఆయన కాస్త వెనకబడ్డారు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి ఈ హీరోకు సరైన హిట్ పడలేదు. కానీ ఈ సంక్రాంతికి పక్కా హిట్ కొడతా అనే నమ్మకంతో “నా సామి రంగ” అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో సంక్రాంతి బరిలోకి దిగబోతున్నారు.
Advertisement
ఈ నేపథ్యంలోనే నాగార్జున రెమ్యూనరేషన్ గురించి టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఫామ్ లో లేని నాగార్జున “నా సామి రంగ” మూవీకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు? అనే విషయంలోకి వెళ్తే..? నాగార్జున హీరోగా డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీ దర్శకత్వంలో కంప్లీట్ ఫ్యామిలీ అండ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా “నా సామి రంగ” మూవీ రూపొందుతోంది. ఈ మూవీలో ఆషికా రంగనాథ్ అనే కన్నడ హీరోయిన్ నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ వంటి యంగ్ హీరోలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరో ఇద్దరు హీరోయిన్లు రుక్సార్ దిల్లాన్, మిర్నా మీనన్ ఈ ఇద్దరు హీరోలకు జోడిగా కనిపించబోతున్నారు. ఇక ఈ మూవీకి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
గత కొద్ది రోజులుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాగార్జున ఈ సినిమా మీద తన ఆశలన్నీ పెట్టుకున్నారు. సంక్రాంతి బరిలో ఈ మూవీని దింపడానికి రాత్రి పగలు తేడా లేకుండా వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తయ్యే విధంగా పని చేస్తున్నారు. నాగార్జునకు బాగా కలిసి వచ్చే సెంటిమెంట్ సీజన్ సంక్రాంతికి “నా సామి రంగ” మూవీ రిలీజ్ కాబోతోంది. జనవరి 14న ఈ మూవీ థియేటర్లలోకి రాబోతోంది. అయితే ఈ సినిమా కోసం నాగార్జున చాలా తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. నాగ్ ఈ మూవీ కోసం కేవలం రూ.10 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకున్నారట.
నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫ్యాన్ బేస్ ఉంది. కానీ వరుసగా ఆయన సినిమాలు ప్లాప్ అవ్వడంతో రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఇతర సీనియర్ హీరోలతో పోల్చుకుంటే నాగ్ బాగా వెనకబడిపోయారు. గతంలో ఆయన చేసిన రెండు చిత్రాలకు నాగార్జున 6- 8 కోట్లు మాత్రమే తీసుకున్నారు. కానీ “నా సామి రంగ” మూవీకి మాత్రం మరో రెండు కోట్లు పెంచి 10 కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు. ఇక “నా సామి రంగ” మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ.32 కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయి. నైజాం ఏరియా థియేట్రికల్ రైట్స్ ను 15 కోట్లకు నాగార్జున తీసుకున్నట్టు సమాచారం. మరి ఈ మూవీతోనైనా నాగార్జున హిట్ అందుకుంటాడేమో చూడాలి.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి